విజయం దిశగా శ్రీలంక | Sri Lanka towards victory in second test england | Sakshi
Sakshi News home page

విజయం దిశగా శ్రీలంక

Jun 24 2014 1:18 AM | Updated on Sep 2 2017 9:16 AM

విజయం దిశగా శ్రీలంక

విజయం దిశగా శ్రీలంక

కెప్టెన్ మాథ్యూస్ (249 బంతుల్లో 160; 25 ఫోర్లు, 1 సిక్సర్) అద్భుత సెంచరీకి... దమ్మిక ప్రసాద్ (4/15) బౌలింగ్ మెరుపులు తోడవడంతో.

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు
 
లీడ్స్: కెప్టెన్ మాథ్యూస్ (249 బంతుల్లో 160; 25 ఫోర్లు, 1 సిక్సర్) అద్భుత సెంచరీకి... దమ్మిక ప్రసాద్ (4/15) బౌలింగ్ మెరుపులు తోడవడంతో... ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో శ్రీలంక విజయం దిశగా దూసుకుపోతోంది. నాలుగోరోజు సోమవారం శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 132.5 ఓవర్లలో 457 పరుగులకు ఆలౌటయింది. టెయిలెండర్ల సాయంతో మాథ్యూస్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు భారీ స్కోరు అందించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 108 పరుగులు వెనకబడ్డ లంక... ఇంగ్లండ్‌కు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆట ముగిసే సమయానికి కుక్ సేన 26.2 ఓవర్లలో 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. రూట్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ప్రసాద్ నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ వెన్నువిరవగా, హెరాత్‌కు ఒక వికె ట్ దక్కింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement