'ఎన్గిడి... నిజంగా నువ్వు మూర్ఖుడివి'

South African Pacer Lungi Ngidi In Black Lives Matter Controversy - Sakshi

జోహ‌న్నెస్‌బ‌ర్గ్‌ : అమెరికా న‌ల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హ‌త్య త‌రువాత ప్ర‌పంచ‌వ్యాప్తంగా జాతి వివక్ష‌పై నిర‌స‌న‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ హ‌త్యోదంతం త‌ర్వ‌తా బ్లాక్ లైవ్స్ మేటర్ అంశంపై  ప్ర‌చారం విస్తృతంగా పెరిగింది. దీనిపై ప‌లువురు వెస్టిండీస్ క్రికెట‌ర్లు కూడా త‌మ గ‌ళం విప్పారు. క్రికెట్‌లోనూ వ‌ర్ణ వివ‌క్ష ఎదుర్కొన్నామంటూ డారెన్ సామి, క్రిస్ గేల్‌, మైఖేల్ హోల్డింగ్ లాంటి ఆట‌గాళ్లు పేర్కొన్నారు. తాజాగా 'బ్లాక్ లైవ్స్ మేటర్' ఉద్యమానికి తాను మద్దతు ఇస్తానని దక్షిణాఫ్రికా స్టార్‌ బౌలర్ లుంగి ఎన్గిడి శుక్ర‌వారం పేర్కొన్నాడు. ఎన్గిడి చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికా క్రికెట్‌లో పెను దుమారాన్నే రేపుతున్నాయి.(అండ‌ర్స‌న్‌.. మొన్న‌నేగా పొగిడాం ఇంత‌లోనే)

'బ్లాక్ లైవ్స్ మేట‌‌ర్‌‌కు నేను మ‌ద్ద‌తు ఇస్తున్నా.. ఈ అంశంలో ఇత‌ర ఆట‌గాళ్ల  మ‌ద్ద‌తు నాకు ఉంటుంద‌నే ఆశిస్తున్నా. గ‌డిచిన కొన్ని సంవ‌త్స‌రాల్లో ద‌క్షిణాఫ్రికాలోనూ జాత్యాహంకారం జ‌ర‌గుతుంది.. క్రికెట్‌లోనూ ఇది కొన‌సాగుతుంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న బ్లాక్ లైవ్స్ మేట‌‌ర్‌కు మా జ‌ట్టులోని ఆటగాళ్లు కూడా క‌లిసి వ‌స్తార‌ని ఆశిస్తున్నా’అని  తెలిపాడు.'  అయితే ఎన్గిడి వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు మాజీ ద‌క్షిణాఫ్రికా ఆట‌గాళ్లు విరుచుకుప‌డ్డారు.

'ఎన్గిడి నువ్వు నిజంగా మూర్ఖుడివి.. బ్లాక్ లైవ్స్ మేటర్‌కు మ‌ద్ద‌తు ఇవ్వాలా వ‌ద్దా అనేది నీ ఇష్టం. నువ్వు మ‌ద్ద‌తు ఇవ్వాల‌నుకుంటే ఇవ్వు. కానీ మొత్తం ద‌క్షిణాఫ్రికా ప్ర‌జ‌ల‌ను ఇందులోకి లాగొద్దు.' అంటూ ద‌క్షిణాఫ్రికా మాజీ స్పిన్న‌ర్ పాట్ సిమ్‌కాక్స్ పేర్కొన్నాడు. ' బ్లాక్ లైవ్స్ మేటర్  ప్ర‌చారం వెనుక రాజ‌కీయ ఉద్య‌మం త‌ప్ప మ‌రొక‌టి లేద‌ని నేను భావిస్తున్నా. ఎన్గిడి..  మ‌ద్ద‌తు ఇచ్చే ముందు థామ‌స్ సోవ‌ల్‌, లారీ ఎల్డ‌ర్‌, వాల్ట‌ర్ విలిమ‌మ్స్ లాంటి తెల్ల‌జాతి రైతుల‌పై జ‌రిగిన దారుణాల‌ను గుర్తు తెచ్చుకోవాలి. ఈ విష‌యంలో నువ్వు  సానుభూతి ప్ర‌క‌టిస్తే బ్లాక్ లైవ్స్ మేటర్ ప్ర‌చారంలో నేను నీతో పాటు వ‌స్తా 'అంటూ మాజీ బ్యాట్స్‌మ‌న్ బొటా డిప్పెనార్ తెలిపాడు.

అయితే ఎన్గిడి వ్యాఖ్య‌ల‌కు తాను మ‌ద్ద‌తిస్తున్న‌ట్లు విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి తెలిపాడు.' బ్లాక్ లైవ్స్ మేటర్ ప్ర‌చారానికి ఎన్గిడి మ‌ద్ద‌తివ్వ‌డం చాలా సంతోషంగా ఉంది. నీ వెనుక ఎవ‌రు లేకున్నా మేమంతా నీతోనే ఉన్నాం . ఈ విష‌య‌లంలో క‌లిసి పోరాడుదాం' అంటూ ట్విట‌ర్‌లో పేర్కొన్నాడు. ఒకప్పుడు వ‌ర్ణ వివ‌క్ష అన్న కార‌ణంతోనే ద‌క్షిణాఫ్రికా ద‌శాబ్దాల‌కు పైగా క్రికెట్ ఆడ‌లేద‌న్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు.('ధోనికున్న మ‌ద్ద‌తు కోహ్లికి లేదు..')

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top