కష్టాల్లో దక్షిణాఫ్రికా | South African cricket team was in trouble | Sakshi
Sakshi News home page

కష్టాల్లో దక్షిణాఫ్రికా

Jul 31 2017 12:11 AM | Updated on Sep 5 2017 5:13 PM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు కష్టాల్లో పడింది.

లండన్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు కష్టాల్లో పడింది. 492 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా... నాలుగో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి 38 ఓవర్లలో 4 వికెట్లకు 117 పరుగులు చేసింది. ఎల్గర్‌ (72 బ్యాటింగ్‌), బవుమా (16 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

దక్షిణాఫ్రికా విజయానికి మరో 375 పరుగులు అవసరంకాగా... చేతిలో ఆరు వికెట్లు మిగిలి ఉన్నాయి. సోమవారం మ్యాచ్‌కు ఆఖరి రోజు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 74/1తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ 79.5 ఓవర్లలో 8 వికెట్లకు 313 పరుగులవద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement