వరల్డ్‌కప్‌.. దక్షిణాఫ్రికా జట్టు ఇదే | South Africa Announce World Cup Squad | Sakshi
Sakshi News home page

వరల్డ్‌కప్‌.. దక్షిణాఫ్రికా జట్టు ఇదే

Apr 18 2019 6:38 PM | Updated on May 29 2019 2:38 PM

South Africa Announce World Cup Squad - Sakshi

కేప్‌టౌన్‌: వచ్చే నెల 30వ తేదీ నుంచి ఇంగ్లండ్‌ వేదికగా జరగబోయే వరల్డ్‌కప్‌కు ఇప్పటికే పలు దేశాలు తమ జట్లను ప్రకటించగా, తాజాగా దక్షిణాఫ్రికా సైతం జట్టును వెల్లడించింది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే 15 మందితో కూడిన జట్టును దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. వరల్డ్‌కప్‌లో పాల్గొనే సఫారీ జట్టుకు డుప్లెసిస్‌నే కెప్టెన్‌గా నియమించింది.

మరో సీనియర్ ఆటగాడు హషీమ్ ఆమ్లాకు కూడా సెలక్టర్లు చోటు కల్పించారు. వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కుతుందని భావించిన హెన్‌డ్రిక్స్‌కు మాత్రం మొండి చేయి చూపించారు. వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన జట్టు టాపార్డర్‌లో డుప్లెసిస్, మార్క్రరమ్, క్వింటన్ డీకాక్, హషీమ్ ఆమ్లా, జేపీ డుమినిలకు చోటు కల్పించారు. బౌలింగ్ విషయానికొస్తే డేల్ స్టెయిన్, కగిసో రబాడ, ఆండిల్ పెహ్లుక్‌వాయో, లుంగి ఎంగిడి, తబ్రాజ్ షంసీలకు చోటు దక్కింది. మరోవైపు సీనియర్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్‌‌కు కూడా సెలక్టర్లు చోటు కల్పించారు.

దక్షిణాఫ్రికా జట్టు.. డుప్లెసిస్(కెప్టెన్), మార్కరమ్‌, క్వింటన్ డీకాక్ (వికెట్ కీపర్), హషీమ్ ఆమ్లా, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, ఆండిల్ పెహ్లుక్‌వాయో, జేపీ డుమిని, డేవాయిన్ ప్రోటోరియస్, డేల్ స్టెయిన్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి, అన్రిచ్ నార్జే, ఇమ్రాన్ తాహిర్, తబ్రాజ్ షంసీ

Advertisement
 
Advertisement
Advertisement