యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ 6-7 (8/10), 4-6, 5-7తో 20వ సీడ్ ఆండ్రియా సెప్పి (ఇటలీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు.
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ 6-7 (8/10), 4-6, 5-7తో 20వ సీడ్ ఆండ్రియా సెప్పి (ఇటలీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో రోహన్ బోపన్న (భారత్)-రోజర్ వాసెలిన్ (నెదర్లాండ్స్) జంట 6-2, 6-4తో బ్రాడ్లీ క్లాన్-సామ్ క్వెరీ (అమెరికా) జోడిపై నెగ్గింది. రెండో రౌండ్‌లో దివిజ్ శరణ్ (భారత్)-యెన్ సున్ లూ (చైనీస్ తైపీ) జోడి 6-4, 5-7, 7-6 (7/2)తో ఎల్రిచ్-ఆండీ రామ్ (ఇజ్రాయెల్) జంటపై; పేస్ (భారత్) -స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) ద్వయం 4-6, 6-3, 6-4తో బ్రాండ్స్ (జర్మనీ)-ఓస్వాల్డ్ (ఆస్ట్రియా) జంటపై గెలిచాయి.
సానియా జంటకు నిరాశ
ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత పోరాటం ముగిసింది. తొలి రౌండ్‌లో సానియా మీర్జా (భారత్)-హొరియా టెకావ్ (రుమేనియా) జోడి 6-4, 6-7 (10/12), 4-10తో లీజెల్ హుబెర్ (అమెరికా)-మార్సెలో మెలో (బ్రెజిల్) జంట చేతిలో; మహేశ్ భూపతి (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం 6-7 (5/7), 6-7 (5/7)తో లిండ్‌స్టెట్ (స్వీడన్)-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) చేతిలో; మూడో సీడ్ బోపన్న (భారత్)-జూలియా (జర్మనీ) ద్వయం 7-6 (7/1), 2-6, 6-10తో అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా)-సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో) జోడి చేతిలో ఓడిపోయాయి.