‘సోనాలీ బింద్రేను కిడ్నాప్‌ చేద్దామనుకున్నా’

Shoaib Akhtar wanted to kidnap Sonali Bendre - Sakshi

ముంబై: పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌కు అప్పట్లో బాలీవుడ్‌ నటి సోనాలీ బింద్రే అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని గతంలోనే చాలాసార్లు బహిరంగంగా వెల్లడించాడు కూడా. అప్పట్లో దీనిపై పెద్ద దుమారమే రేగింది. తను అంటే చాలా ఇష్టమని అక్తర్‌ పదే పదే చెప్పడం కూడా సోనాలీకి ఆగ్రహం తెప్పించిన సందర్భాల్లో కూడా ఉన్నాయి.  ఈ క్రమంలోనే అసలు అక్తర్‌ ఎవరో తనకు తెలియదని సోనాలీ బింద్రే ఒకానొక సందర్భంలో వ్యాఖ్యానించి ఆ ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌’కు గట్టి కౌంటరే ఇచ్చారు.

అయితే  తాజాగా ఓ చాట్‌షోలో మరోసారి సోనాలీ బింద్రే ప్రస్తావన తీసుకొచ్చాడు అక్తర్‌. తన ప్రేమకోసం ఏకంగా ఆమెను కిడ్నాప్‌ చేద్దామనుకున్నాడట. సోనాలీ నటించిన ‘ఇంగ్లీష్‌ బాబు దేసీ మేమ్‌’ అనే బాలీవుడ్‌ మూవీతో ఆమెపై ఇష్టాన్ని పెంచుకున్నాననీ.. అప్పట్నుంచి సోనాలీ ఫొటోను తన జేబులోనే పెట్టుకొని తిరిగేవాడినని చెప్పుకొచ్చాడు. ఒకవేళ తన ప్రేమను ఒప్పుకోకపోతే.. సోనాలీని కిడ్నాప్‌ కూడా చేయాలనుకున్నానని ఆ షోలో తెలిపాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top