ధావన్‌ అరుదైన ఘనత

Shikhar Dhawan Joins Illustrious List With This Unique Record - Sakshi

దుబాయ్‌: టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక వన్డే మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు పట్టి ఆ ఘనత సాధించిన ఏడో భారత ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్‌ నాలుగు క్యాచ్‌లను పట్టాడు. బంగ్లా ఆటగాళ్లు నజ్ముల్లా హుస్సేన్‌, షకిబుల్‌ హసన్‌, మెహిదీ హాసన్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ క్యాచ్‌లను ధావన్‌ అందుకున్నాడు. ఫలితంగా వన్డే మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు పట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో ధావన్‌ చేరిపోయాడు.

గతంలో సునీల్‌ గావస్కర్‌ (పాక్‌పై షార్జాలో; 1985), అజహరుద్దీన్‌ (పాక్‌పై టొరంటోలో; 1997), సచిన్‌ టెండూల్కర్‌ (పాక్‌పై ఢాకాలో; 1998), రాహుల్‌ ద్రవిడ్‌ (విండీస్‌పై టొరంటోలో; 1999), మొహమ్మద్‌ కైఫ్‌ (శ్రీలంకపై జొహన్నెస్‌బర్గ్‌లో; 2003), వీవీఎస్‌ లక్ష్మణ్‌ (జింబాబ్వేపై పెర్త్‌లో; 2004) ఈ ఘనత సాధించారు. అయితే ఒక వన్డే మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఘనత దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్‌ పేరిట ఉంది. 1993లోవ వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో రోడ్స్‌ ఐదు క్యాచ్‌లు పట్టాడు.

చదవండి: జడేజా ‘సూపర్‌’  4

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top