ఆడే సత్తా నాలో ఉంది: షరపోవా | Sharapova Takes Brisbane Wildcard | Sakshi
Sakshi News home page

ఆడే సత్తా నాలో ఉంది: షరపోవా

Jan 1 2020 3:37 AM | Updated on Jan 1 2020 3:37 AM

Sharapova Takes Brisbane Wildcard - Sakshi

బ్రిస్బేన్‌: మాజీ ప్రపంచ నంబర్‌వన్‌ మరియా షరపోవా తనలో ఇంకా టెన్నిస్‌ ఆడే సత్తా ఉందని చెప్పింది. ఈనెల 6 నుంచి బ్రిస్బేన్‌లో జరిగే ఈ టోర్నీలో మాజీ విజేత అయిన షరపోవాకు వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఈ రష్యా స్టార్‌ 2015లో ఇక్కడ టైటిల్‌ గెలిచింది. ఏటా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీకి ముందు సన్నాహక టోర్నీగా ఈ ఈవెంట్‌ జరుగుతుంది. ఇందులో పాల్గొంటానని చెప్పిన 32 ఏళ్ల షరపోవా కెరీర్‌ తొలినాళ్లలో 30 దాటాక కూడా ఆడతానని ఎప్పుడు అనుకోలేదని తెలిపింది. ‘కానీ నాలో ఆట మిగిలుంది.

నా రాకెట్‌తో దూసుకెళ్లే సత్తా కూడా ఉంది. నేనిక్కడ ఎవరికైనా మేటి ప్రత్యర్థినే’ అని రష్యా స్టార్‌ వివరించింది. గత సీజన్‌ క్లిష్టంగా గడిచిన తనకు ఇది తాజా ఆరంభమని చెప్పుకొచ్చింది. ఆగస్టులో జరిగిన యూఎస్‌ ఓపెన్‌లో సెరెనాతో తొలి రౌండ్లో ఓడిపోయాక షరపోవా మళ్లీ బరిలోకి దిగలేదు. దీంతో డబ్ల్యూటీఏ ర్యాంకుల్లో ఆమె 133వ ర్యాంకుకు పడిపోయింది. బ్రిస్బేన్‌ ఈవెంట్‌లో ఆమెతో పాటు నయోమి ఒసాకా, యాష్లే బార్టీ, ప్లిస్కోవా, ఎలీనా స్వితొలినా, క్విటోవా, కికి బెర్టెన్స్‌ తదితర స్టార్‌ క్రీడాకారిణులు పాల్గొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement