పాముల పుట్టలో తలపెట్టిన షేన్‌వార్న్! | Shane Warne's encounter with anaconda, gets bitten on the head | Sakshi
Sakshi News home page

పాముల పుట్టలో తలపెట్టిన షేన్‌వార్న్!

Feb 18 2016 3:07 PM | Updated on Sep 3 2017 5:54 PM

పాముల పుట్టలో తలపెట్టిన షేన్‌వార్న్!

పాముల పుట్టలో తలపెట్టిన షేన్‌వార్న్!

చీమ చీమ మా పిల్లాడిని ఎందుకు కుట్టావ్ అంటే.. నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అందట. షేన్ వార్న్‌కు కూడా అలాగే అయ్యింది.

సిడ్నీ: చీమ చీమ మా పిల్లాడిని ఎందుకు కుట్టావ్ అంటే.. నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అందట. ఇది మనందరికీ బాగా తెలిసిన కథ. మరి ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ కూడా ఇలాగే సరదా పడ్డాడు. కానీ.. షేన్ వార్న్ పెట్టింది చీమలో పుట్టలో కాదు, పెట్టింది వేలూ కాదు. ఏకంగా పాముల 'పుట్ట'లో తల దూర్చాడు. మరి అది ఊరుకుంటుందా? ఏం చేసిందో చూద్దామా...
 

ఆస్ట్రేలియాలో నెట్ వర్క్ టెన్ నిర్వహించిన ఓ రియాల్టీ షోకు వార్న్ హాజరయ్యాడు. అక్కడికి సెలబ్రిటీ హోదాలో వెళ్లిన వార్న్.. అనకొండలతో ఓ టాస్క్  చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే  అనకొండలున్న పెట్టెలో తలదూర్చాడు. ఇందులో ఒక అనకొండ వార్న్ తలపై కాటు వేసింది. అయితే ఈ విషయంలో వార్న్ అదృష్టం బాగుందనే చెప్పాలి. అది విషపూరితం కాకపోవడం, మరీ పెద్దగా కాటేయకపోవడంతో.. తలపై చిన్నచిన్న గాట్లు మాత్రమే పడ్డాయి. అదే గట్టిగా కాటేస్తే.. సుదీర్ఘ కాలం పాటు చికిత్స చేయించుకోవాల్సి వచ్చేదట.

కాగా, దీనిపై ఆ షో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్టీఫెన్ టేట్ మాట్లాడుతూ..మనుషులు భయపడేవాటిలో సరీసృపాలు కూడా ఒకటన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అనకొండ కరిచిన తరువాత కూడా వార్న్ ఆ టాస్క్ పూర్తి చేయడం నిజంగా చాలా సాహసంతో కూడుకున్నదని స్టీఫెన్ పేర్కొన్నారు. ప్రస్తుతం వార్న్ చికిత్స తీసుకుంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement