ఫైనల్కు దూసుకెళ్లిన నల్లకలువ | Serena demolishes Radwanska to reach Australian Open final | Sakshi
Sakshi News home page

ఫైనల్కు దూసుకెళ్లిన నల్లకలువ

Jan 28 2016 11:47 AM | Updated on Sep 18 2019 2:58 PM

డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించింది.

మెల్బోర్న్: డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో నాలుగోసీడ్ క్రీడాకారిని రద్వాన్స్కాను వరుస సెట్లలో ఓడించి 7వ సారి ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 64 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్లో సెరెనా పవర్ గేమ్ ముందు రద్వాన్స్కా ఏ మాత్రం నిలువలేకపోయింది. మొదటి సెట్ను 6-0తో అలవోకగా గెలుచుకున్న సెరెనాకు రెండో సెట్లో కాస్త ప్రతిఘటన ఎదురైనప్పటికీ.. 6-4తో సెట్ను గెలుచుకొని ఫైనల్లోకి ప్రవేశించింది.

శనివారం జరగనున్న ఫైనల్లో ఏడో సీడ్ క్రీడాకారిణి కెర్బర్ లేదా అన్సీడెడ్ క్రీడాకారిణి జొహన్నా కొంటాతో సెరెనా తలపడనుంది. ఫైనల్లో విజయం సాధిస్తే ఈ నల్ల కలువ ఖాతాలో 22వ గ్రాండ్ స్లామ్ టైటిల్ చేరుతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement