అథ్లెట్‌ సంజీవని జాదవ్‌కు కాంస్యం | Sanjeevani gets Bronze medal | Sakshi
Sakshi News home page

అథ్లెట్‌ సంజీవని జాదవ్‌కు కాంస్యం

Mar 16 2018 2:04 AM | Updated on Mar 16 2018 2:04 AM

Sanjeevani gets Bronze medal - Sakshi

ఆసియా క్రాస్‌ కంట్రీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు కాంస్య పతకాలు లభించాయి. చైనాలో జరుగుతున్న ఈ పోటీల్లో మహిళల 8 కిలోమీటర్ల రేసులో భారత అథ్లెట్‌ సంజీవని జాదవ్‌ మూడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రకు చెందిన 20 ఏళ్ల సంజీవని 28 నిమిషాల 19 సెకన్లలో గమ్యానికి చేరి కాంస్య పతకం దక్కించుకుంది. టీమ్‌ విభాగంలో సంజీవని, స్వాతి, జుమా ఖాతున్, లలితా బబర్‌లతో కూడిన భారత బృందం కాంస్యం సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement