భారత బ్యాడ్మింటన్ స్లార్స్ సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ తమ హవా కొనసాగిస్తున్నారు.
కౌలాలంపూర్: భారత బ్యాడ్మింటన్ స్లార్స్ సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ తమ హవా కొనసాగిస్తున్నారు. మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ లోనూ వీరిద్దరూ శుభారంభం చేశారు.
గురువారం అధికారికంగా ప్రపంచ నెంబర్ వన్ కాబోతున్న సైనా బుధవారమిక్కడ జరిగిన తొలి మ్యాచ్ లో విజయం సాధించింది. ఇండోనేసియా క్రీడాకారిణి మారియా ఫెబె కుసుమస్తుతిపై 21-13 21-16 గెలిచి రెండో రౌండ్ లోకి ప్రవేశించింది. రెండో రౌండ్ లో చైనా క్రీడాకారిణి యావొ జుయ్ తో తలపడుతుంది.
పురుషుల సింగిల్స్ విభాగంలో ఇంగ్లండ్ ప్లేయర్ రాజీవ్ ఔసెఫ్ ను 10-21 21-15 22-24 తేడాతో శ్రీకాంత్ ఓడించాడు. టియన్ హౌవుయ్ తో రెండో రౌండ్ లో శ్రీకాంత్ ఆడతాడు.