సైనా మళ్లీ నంబర్‌వన్ | Saina Nehwal Is No. 1 In World Badminton Once More | Sakshi
Sakshi News home page

సైనా మళ్లీ నంబర్‌వన్

Apr 17 2015 1:22 AM | Updated on Sep 3 2017 12:23 AM

సైనా మళ్లీ నంబర్‌వన్

సైనా మళ్లీ నంబర్‌వన్

భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది.

న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది. చైనా క్రీడాకారిణి లీ జురుయ్ సింగపూర్ ఓపెన్ నుంచి తప్పుకోవడంతో సైనాకు ఈ ర్యాంక్ ఖరారైంది. ఇండియా ఓపెన్‌లో విజేతగా నిలిచిన తర్వాత నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న హైదరాబాద్ అమ్మాయి వారం రోజుల పాటే ఆ ర్యాంక్‌లో కొనసాగింది. మలేసియా ఓపెన్ సెమీస్‌లో ఓడటంతో అగ్రస్థానాన్ని చేజార్చుకుంది. మరోవైపు పి.వి.సింధు మూడు స్థానాలు కోల్పోయి 12వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. పురుషుల విభాగంలో శ్రీకాంత్ నాలుగో ర్యాంక్‌ను నిలబెట్టుకోగా, పారుపల్లి కశ్యప్ 14, హెచ్.ఎస్.ప్రణయ్ 15వ ర్యాంక్‌లో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement