ఫైనల్‌కు ‘సై’నా | Saina Nehwal enters Indonesia Masters final | Sakshi
Sakshi News home page

ఫైనల్‌కు ‘సై’నా

Jan 27 2019 1:47 AM | Updated on Jan 27 2019 1:47 AM

Saina Nehwal enters Indonesia Masters final - Sakshi

జకార్తా: భారత సీనియర్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ ఈ సీజన్‌లో తొలి టైటిల్‌కు చేరువైంది. ఇండోనేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో ఆమె ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్‌ సైనా 18–21, 21–12, 21–18తో ఆరో సీడ్‌ హి బింగ్‌జియావో (చైనా)పై విజయం సాధించింది.

నేడు జరిగే టైటిల్‌ పోరులో 28 ఏళ్ల భారత వెటరన్‌... ప్రపంచ, ఒలింపిక్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌)తో తలపడనుంది. మరో సెమీస్‌లో మారిన్‌ 17–21, 21–11, 23–21తో చెన్‌ యుఫె (చైనా)పై నెగ్గింది.

నేటి ఫైనల్స్‌ 
ఉదయం గం. 11.30 నుంచి  స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌–1లో ప్రత్యక్ష ప్రసారం 

Advertisement
 
Advertisement
Advertisement