సైనా నెహ్వాల్ అవుట్ | saina nehwal crashes out of rio singles event | Sakshi
Sakshi News home page

సైనా నెహ్వాల్ అవుట్

Aug 14 2016 6:48 PM | Updated on Sep 4 2017 9:17 AM

సైనా నెహ్వాల్ అవుట్

సైనా నెహ్వాల్ అవుట్

రియో ఒలింపిక్స్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారణి సైనా నెహ్వాల్ నిరాశపరిచింది.

రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారణి సైనా నెహ్వాల్ నిరాశపరిచింది. గ్రూప్ -జిలో భాగంగా ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్ లో మారియా ఉలితినా(ఉక్రెయిన్)చేతిలో 18-21, 19- 21 తేడాతో సైనా పరాజయం చెందింది. దీంతో ఒలింపిక్స్ లో సైనా పోరాటం ముగిసింది. రియో ఒలింపిక్స్ లో ఐదో సీడ్ బరిలోకి దిగిన సైనా.. 61వ ర్యాంక్ క్రీడాకారిణి ఉలితినా చేతిలో ఓటమి పాలు కావడంతో భారత పెట్టుకున్న ఆశలకు బ్రేక్ పడింది. ఈ గ్రూప్ లో తొలి మ్యాచ్ లో గెలిచిన సైనా.. రెండో మ్యాచ్ లో మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

 

ఈ మ్యాచ్ లో తొలి గేమ్ ఆరంభంలో ఆధిక్యంలోకి వెళ్లినట్లు కనిపించిన సైనా.. అనూహ్యంగా వెనుబడి ఆ గేమ్ను చేజార్చుకుంది. అనంతరం రెండో గేమ్లో తీవ్ర ఒత్తిడిలోనైన సైనా ఉలితినాను నిలువరించలేకపోయింది. అటు ఎఫెన్స్లోనూ, ఇటు డిఫెన్స్లోనూ అత్యంత పేలవ ప్రదర్శనతో సైనా తగిన మూల్యం చెల్లించుకుంది. గత లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించిన సైనా..మరోసారి ఒలింపిక్స్ పతకం సాధించాలన్న ఆశలు తీరలేదు. ఇక మహిళల సింగిల్స్ లో పివీ సింధుపైనే భారత పతకం ఆశలు ఆధారపడి ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement