రొనాల్డో- మెస్సీ దెబ్బకు విడాకులు తీసుకున్న జంట

Russian Couple Divorce Over Ronaldo Messi Debate - Sakshi

మాస్కో: రొనాల్డో- మెస్సీ డిబేట్‌ దంపతుల మధ్య చిచ్చు పెట్టింది. ఈ గొడవ పెద్దదై చివరకు వీడాకుల వరకు తీసుకెళ్లింది. ఒకరు రొనాల్డో అభిమాని కాగా.. మరొకరు మెస్సీ అభిమాని. అయితే ఈ ఇద్దరిని కలిపింది కూడా ఈ ఫుట్‌ బాల్‌ ఆటనే కావడం విశేషం. ఓ రష్యన్‌ పత్రిక కథనం మేరకు.. అర్సెన్‌, ల్యూధ్‌మిలా అనే దంపతులు ఓ బార్‌లో 2002 ఫుట్‌ బాల్‌ ప్రపంచకప్‌ మ్యాచ్‌ను చూస్తూ కలుసుకున్నారు. అనంతరం వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి పీటలెక్కింది. అయితే 16 ఏళ్ల అనంతరం తమ అభిమాన ఆటగాళ్ల విషయంలో జరిగిన గొడవ వారి బంధానికి ఎండ్‌ కార్డ్‌ వేసింది.

నైజీరియాపై అర్జెంటీనా విజయాన్ని భర్త ఆస్వాదిస్తుండగా.. ఆగ్రహానికిలోనైన భార్య.. మెస్సీ కన్న  రోనాల్డో గొప్పవాడనే టాపిక్‌ తీసుకొచ్చింది. దీంతో ఈ దంపతులు మధ్య ఈ విషయంలో తీవ్ర చర్చ జరిగింది. ఇది చినికి చినికి పెద్ద గొడవకు దారీ తీసింది. ఫిఫా ప్రపంచకప్‌ మొదలైనప్పటి నుంచి తన అభిమాన ఆటగాడు మెస్సీని తక్కువ చేస్తూ తన భార్య మాట్లాడుతూనే ఉందని, ఆమె రోనాల్డోను పిచ్చిగా అభిమానిస్తుందని అతను మీడియాతో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది భరించలేకనే ఆమెకు దూరంగా వచ్చానని, ఇలా గొడవ జరగడం ఇదే తొలి సారి కాదన్నాడు. దీంతో విసుగు చెందే విడాకులకు దరఖాస్తు చేసినట్లు పేర్కొన్నాడు. ఇక ఈ ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు స్టార్‌ ఆటగాళ్ల పోరు నాకౌట్‌లో ఒకే రోజు ముగిసిన విషయం తెలిసిందే. అర్జెంటీనా ఫ్రాన్స్‌ చేతిలో ఓడిపోగా.. పోర్చ్‌గల్‌ ఉరుగ్వే చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top