కెరీర్‌ బెస్ట్‌ మూడో ర్యాంకులో రాహుల్‌ 

Rahul is career best rank - Sakshi

దుబాయ్‌: భారత బ్యాట్స్‌మన్‌ లోకేశ్‌ రాహుల్‌ ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ బెస్ట్‌ మూడో ర్యాంకుకు ఎగబాకాడు. భారత జట్టు కూడా రెండో స్థానానికి చేరుకుంది. ఐర్లాండ్‌పై అర్ధసెంచరీ (70), ఇంగ్లండ్‌పై అజేయ సెంచరీ (101 నాటౌట్‌)తో చెలరేగిన ఈ భారత ఆటగాడు ఐసీసీ బ్యాట్స్‌మెన్‌ ర్యాంకుల్లో ఏకంగా 9 స్థానాల్ని మెరుగుపర్చుకుని టాప్‌–3లో నిలిచాడు.

ఈ రెండు సిరీస్‌లను గెలుచుకున్న భారత్‌ మూడో ర్యాంకు నుంచి రెండో ర్యాంకుకు ఎగబాకింది. నిర్ణాయక మూడో టి20 మ్యాచ్‌లో వీరోచిత సెంచరీతో టీమిండియాకు సిరీస్‌ను అందించిన ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 13 నుంచి 11వ స్థానానికి చేరుకోగా, ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్‌ ఫించ్‌ (891) పొట్టి ఫార్మాట్‌లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top