నాదల్‌కు స్వర్ణం | Rafael Nadal wins gold as Spain beats Romania in doubles | Sakshi
Sakshi News home page

నాదల్‌కు స్వర్ణం

Aug 14 2016 2:16 AM | Updated on Sep 4 2017 9:08 AM

నాదల్‌కు స్వర్ణం

నాదల్‌కు స్వర్ణం

స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ రెండో ఒలింపిక్స్ స్వర్ణం గెలుపొందాడు. దీర్ఘకాల మిత్రుడు మార్క్ లోపేజ్‌తో కలిసి పురుషుల డబుల్స్

రియో డి జనీరో: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ రెండో ఒలింపిక్స్ స్వర్ణం గెలుపొందాడు. దీర్ఘకాల మిత్రుడు మార్క్ లోపేజ్‌తో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. రొమేనియా జోడి మెర్జియా, హోరియాలతో జరిగిన ఫైనల్లో 2-6, 6-3, 6-4 తేడాతో విజయం సాధించారు. ఈ విజయంతో.. ఒలింపిక్స్‌లో సింగిల్స్, డబుల్స్ గెలిచిన నాలుగో టెన్నిస్ స్టార్‌గా (సెరెనా, వీనస్, నికోలస్ మస్సు) నిలిచాడు.

2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో నాదల్ సింగిల్స్‌లో స్వర్ణం అందుకున్నాడు. అటు పురుషుల సింగిల్స్‌లోనూ బ్రెజిల్ క్రీడాకారుడు థామస్ బెలూచీపై 2-6, 6-4, 6-2తేడాతో విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాడు. మరోవైపు, డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రే సెమీస్‌లో జపాన్ ప్లేయర్ కీ నిషికోరీపై 6-1,  6-4తో గెలిచి ఫైనల్ చేరాడు. కాగా, మహిళల సింగిల్స్ ఫైనల్లో పుయెర్టోరికో క్రీడాకారిణి, మోనికా ప్యూగ్, ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ కెర్బర్ బంగారు పతకం కోసం పోటీపడనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement