అండర్-19 చెస్ టోర్నీ స్టాంప్ విడుదల | postal stamp released for under 19 chess tourny | Sakshi
Sakshi News home page

అండర్-19 చెస్ టోర్నీ స్టాంప్ విడుదల

Oct 2 2016 12:25 PM | Updated on Sep 18 2018 8:19 PM

దేశంలో చెస్ చరిత్రలో తొలిసారిగా ఓ టోర్నీకి సంబంధించి పోస్టల్ స్టాంప్‌ను ఆవిష్కరించారు.

  సాక్షి, హైదరాబాద్: దేశంలో చెస్ చరిత్రలో తొలిసారిగా ఓ టోర్నీకి సంబంధించి పోస్టల్ స్టాంప్‌ను ఆవిష్కరించారు. ఖమ్మంలో ఈ నెల 3 నుంచి 6 వరకు జరిగే అండర్-19 చెస్ చాంపియన్‌షిప్ సందర్భంగా స్టాంప్‌ను ఆవిష్కరించారు. తొలి తెలంగాణ జూనియర్ ఫిడే రేటింగ్ టోర్నీని ఖమ్మం జిల్లా చెస్ సంఘం నిర్వహిస్తోంది.

 

తెలంగాణలోని అన్ని జిల్లాల క్రీడాకారులు పాల్గొనే ఈ ఈవెంట్‌లో రాణించిన వారిలో...  బాలుర, బాలిక విభాగంలో నలుగురు చొప్పున క్రీడాకారులు జాతీయ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధిస్తారు. మూడో తేదీన ఖమ్మంలోనే జరిగే తెలంగాణ చెస్ సంఘం ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశంలో చెస్ చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించనున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement