నిఖత్‌ పసిడి పంచ్‌ | nikath win the medal | Sakshi
Sakshi News home page

నిఖత్‌ పసిడి పంచ్‌

Apr 29 2018 1:21 AM | Updated on Apr 29 2018 1:21 AM

nikath win the medal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బెల్‌గ్రేడ్‌ ఓపెన్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. సెర్బియాలో శనివారం జరిగిన మహిళల 51 కేజీల విభాగం ఫైనల్లో నిజామాబాద్‌ బాక్సర్‌ నిఖత్‌ 3–0తో ఐకతెరిని కుట్‌సోజియోర్‌గోపులు (గ్రీస్‌)పై విజయం సాధించింది. సెమీ ఫైనల్లో నిఖత్‌ 3–0తో నీనా రాడోవనోవిచ్‌ (సెర్బియా)ను ఓడించింది. ంచింది.   

Advertisement
 
Advertisement
Advertisement