మళ్లీ నంబర్‌వన్‌గా ఒసాకా | Naomi Osaka Once Again Will Become Number One Again In Tennis | Sakshi
Sakshi News home page

మళ్లీ నంబర్‌వన్‌గా ఒసాకా

Aug 11 2019 6:47 AM | Updated on Aug 11 2019 6:47 AM

Naomi Osaka Once Again Will Become Number One Again In Tennis - Sakshi

టొరంటో (కెనడా) : మహిళల టెన్నిస్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో జపాన్‌ ప్లేయర్‌ నయోమి ఒసాకా మరోసారి నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకోనుంది. మాంట్రియల్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ టోర్నీ క్వార్టర్‌ ఫైనల్లో ఒసాకా 3–6, 4–6తో మాజీ నంబర్‌వన్‌ సెరెనా విలియమ్స్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. అయితే ప్రస్తుత నంబర్‌వన్‌గా ఉన్న యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ఈ టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఓడిపోవడంతో... సోమవారం విడుదల చేసే తాజా ర్యాంకింగ్స్‌లో ఒసాకా మళ్లీ టాప్‌ ర్యాంక్‌లోకి రానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement