అందుకు ధోనినే కారణం: సిరాజ్‌ | MS Dhonis pep talk helped Mohammed Siraj earn maiden Test call | Sakshi
Sakshi News home page

అందుకు ధోనినే కారణం: సిరాజ్‌

Oct 2 2018 10:40 AM | Updated on Oct 2 2018 11:08 AM

 MS Dhonis pep talk helped Mohammed Siraj earn maiden Test call - Sakshi

హైదరాబాద్‌: టెస్టు జట్టులో స్థానం సంపాదించిన హైదరాబాద్‌ పేసర్‌ మహ్మ ద్‌ సిరాజ్‌ తన కెరీర్‌ ఇలా దూసుకెళ్లడానికి మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని సహకారం ఎంతో ఉందన్నాడు. అతని వల్లే తన కెరీర్‌ మలుపు తిరిగిందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ‘ భారత టెస్టు జట్టులో ఆడాలన్న నా కల నిజమైందని అనుకుంటున్నా. టెస్టుల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించాలని భావించాను. ఇటీవల భారత్‌ ‘ఎ’ తరఫున మెరుగ్గా రాణించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాను. ఇక్కడ ధోని గురించి ప్రధానంగా చెప్పాలి.

యువ ఆటగాళ్లకు అండగా నిలవడంలో ధోని భాయ్‌ ఎప్పుడూ ముందుంటాడు. నా తొలి మ్యాచ్‌(న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌)లో బౌలింగ్‌ చేసే క‍్రమంలో చాలా గందరగోళానికి గురయ్యా. దీనికి తోడు ఒత్తిడిలోకి కూడా ఉన్నాను.  దీన్ని గమనించిన ధోని నా దగ్గరకు వచ్చాడు. ‘బ్యాట్స్‌మన్‌ ఫుట్‌వర్క్‌ను క్షుణ్ణంగా పరిశీలించు. దానికి తగ్గట్టుగా లైన్‌ అండ్‌ లెంగ్త్‌ను మార్చుకో’ అని సలహా ఇచ్చాడు. అతడితో ఆ సంభాషణ తర్వాత..  తన గేమ్‌ మరో స్థాయికి వెళ్లిందన్నాడు. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు మహ్మద్‌ సిరాజ్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement