గొప్ప మనసు చాటుకున్న ధోని

MS Dhoni Adorable Gesture Shows Why He Is Still A Crowd Favourite - Sakshi

రాంచీ : టీమిండియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని గత కొద్ది రోజులగా నిలకడలేమి ఆటతో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ తరహా ఆటతో చివరకు టీ20 జట్టులో చోటు కూడా కోల్పోయాడు. మరోవైపు ధోని బ్యాట్‌ ఝుళిపించకపోయినా అతని క్రేజ్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. అతను ఆడకపోయినా ఆటలోని అతని వ్యూహాలు... మార్క్‌ కీపింగ్‌తో అభిమానులు తమ గుండెల్లో పదిలంగా ఉంచుకుంటున్నారు. వారి అభిమానాన్ని ఒక్కోలా వ్యక్తపరుస్తున్నారు. ఇటీవల వెస్టిండీస్‌తో చివరి వన్డే సందర్భంగా కేరళ గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియం బయట 35 అడుగుల ఎత్తైన ధోని కటౌట్‌ను ఏర్పాటు చేసి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. (చదవండి: 35 అడుగుల ధోని కటౌట్‌..)

ధోని కూడా వారి అభిమానులను అలరిస్తూ సంతోషపరుస్తుంటారు. ఈ నేపథ్యంలో ధోని తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఓ కార్యక్రమానికి వెళ్లొస్తున్న ధోనికి ఓ చిన్నారి అభిమాని కనిపించాడు. వెంటనే ప్రొటోకాల్‌ను సైతం పక్కన పెట్టి ధోని కారులో నుంచే ఆ అభిమానితో ముచ్చటించాడు. షేకాండ్‌ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ధోని భాయ్‌ గొప్ప మనసంటూ.. అతని అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. ఇక ధోని వన్డేల్లో 10వేల పరుగుల మైలు రాయి అందుకోవడానికి ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో ధోని 10,174 పరుగులు చేయగా.. ఇందులో వరల్డ్‌ ఎలెవన్‌ జట్టు తరపున చేసిన 174 పరుగలున్నాయి. (చదవండి: ధోని ఇక.. కబడ్డీ కబడ్డీ!)

ఈ ఏడాది ధోని దారుణంగా విఫలమయ్యాడు. 12 ఇన్నింగ్స్‌లాడిన ధోని కేవలం 252 పరుగులు మాత్రమే చేశాడు. ఈ తరహా ఆటతోనే టీ20ల్లో చోటు కోల్పోయాడు. ఇక ధోనిని జట్టుకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అతని అభిమానులు ఆరోపిస్తుండగా.. ధోనిని పక్కనే పెట్టే ఉద్దేశం లేదని, ప్రత్యామ్నాయ వికెట్‌ కీపర్‌ కోసమే అతనికి విశ్రాంతి ఇచ్చినట్లు సెలక్టర్లు పేర్కొన్నారు. ధోని లాంటి ఆటగాడు లేకపోవడం ఏ జట్టుకైనా లోటేనని హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఇటీవల అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే. ( చదవండి: ధోని లేకపోవడం లోటే)    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top