MS Dhoni Celebrates his 37th Birthday with his Family and Team India Cricketers in England - Sakshi
Sakshi News home page

ఓం ఫినిషాయ నమః : ధోని బర్త్‌డేపై సెహ్వాగ్‌

Jul 7 2018 12:23 PM | Updated on Jul 7 2018 4:26 PM

MS Dhoni celebrates 37th birthday with Sakshi

కార్డిఫ్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఈరోజు తన 37వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.  ఇంగ్లండ్‌తో సుదీర్ఘ పర్యటనలో భాగంగా ప్రస్తుతం కుటుంబంతో సహా విదేశాల్లో ఉన్న ధోని పుట్టిన రోజును టీమిండియా క్రికెటర్లు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ధోని భార్య సాక్షితో సహా పలువురు బర్త్‌ డే విషెస్‌ తెలిపారు.


‘ధోనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ జీవితం ఇప్పటి కంటే ఇంకా సంతోషంగా ఉండాలి. నీ స్టంపింగ్‌ కంటే జీవితంలో నువ్వు సాధించే విజయాలే వేగంగా ఉండాలి. ‘ఓం ఫినిషాయ నమః!’- వీరేంద్ర సెహ్వాగ్‌

‘హ్యాపీ బర్త్‌ డే టూ యూ! నువ్వెంత గొప్ప వ్యక్తివో చెప్పడానికి మాటలు సరిపోవు. గత పదేళ్లుగా నీ నుంచి నేనెంతో నేర్చుకుంటున్నాను. ఇదిలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతో ప్రేమతో నా జీవితాన్ని ఆనందమయం చేసిన నీకు ధన్యవాదాలు.’
- సాక్షి (ధోని భార్య)

‘500అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రయాణం. నీలాంటి లెజెండ్‌ పుట్టినందుకు టీమిండియా గర్విస్తోంది. హ్యాపీ బర్త్‌డే బ్రదర్‌. నాకు స్ఫూర్తి నువ్వే . నీతో ఉన్న అన్ని సమయాలను నేనెప్పుడూ గుర్తు పెట్టుకుంటాను’ - సురేశ్‌ రైనా

‘పుట్టిన రోజు శుభాకాంక్షలు ధోనీ. మాకు ఎన్నో ట్రోఫీలు తెచ్చిపెట్టినందుకు నీకు ధన్యవాదాలు’- రవీంద్ర జడేజా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement