టీమిండియా కెప్టెన్‌ మిథాలి రాజ్‌ రికార్డు | Mithali surpasses edwards to become highest run scorer in women's ODI | Sakshi
Sakshi News home page

టీమిండియా కెప్టెన్‌ మిథాలి రాజ్‌ రికార్డు

Jul 12 2017 5:13 PM | Updated on Sep 5 2017 3:52 PM

టీమిండియా కెప్టెన్‌ మిథాలి రాజ్‌ రికార్డు

టీమిండియా కెప్టెన్‌ మిథాలి రాజ్‌ రికార్డు

భారత మహిళల జట్టు కెప్టెన్‌ మిథాలి రాజ్‌ రికార్డు సృష్టించారు.

లండన్‌: భారత మహిళల జట్టు కెప్టెన్‌ మిథాలి రాజ్‌ రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా ఆమె రికార్డులకెక్కారు. మహిళా ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో బ్రిస్టల్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో బుధవారం మిథాలి ఈ ఘనత సాధించారు. అంతేకాదు వన్డే క్రికెట్‌ చరిత్రలో ఆరు వేల పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్‌ కూడా మిథాలినే.

ఈ రికార్డును సాధించే క్రమంలో ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్‌ చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ పేరిట ఉన్న 5992 పరుగుల రికార్డును మిథాలి అధిగమించారు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు మిథాలి రాజ్‌ ఈ ఫీట్‌ సాధించడానికి 33 పరుగుల దూరంలో ఉన్నారు. కాగా, అత్యధిక పరుగులు సాధించిన మహిళల క్రికెట్‌ కెప్టెన్‌ మిథాలి రాజ్‌కు పురుషుల క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ట్వీటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement