కోహ్లీ కంటే ముందుగానే మిథాలీ రికార్డు

Mithali Raj Becomes First Indian To 2000 Runs In International T20 Matches - Sakshi

కౌలాలంపూర్‌ : భారత మహిళా వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ సారి మాత్రం కోహ్లీ కంటే ముందుగానే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ తరపున 2వేల పరుగుల మైలురాయిని దాటిన తొలి భారత క్రికెటర్‌గా ఘనత సాధించారు. ఇప్పటి వరకూ అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ తరపున మహిళా, పురుషుల జట్టుల్లో  ఏ ఒక్కరు ఈ రికార్డును అందుకోలేదు. 

కౌలాలంపూర్‌లో జరుగుతున్న మహిళల ఆసియా కప్‌లో శ్రీలంకతో జరిగన మ్యాచ్‌లో మిథాలీ రాజ్‌ 23 బంతుల్లో 33 పరుగులు చేసి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. వీటితో కలుపుకొని  అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో మొత్తం 2015 పరుగులను పూర్తి చేశారు. సెంచరీల మీద సెంచరీలు బాదే కోహ్లీ ఈ రికార్డుకు అడుగు దూరంలో ఉన్నారు. 1983 పరుగులు చేసిన కోహ్లీ, మిథాలీ తరువాతి స్థానంలో ఉన్నారు. ఇప్పటికే 2వేల పరుగుల మైలురాయిని ఆరుగురు అందుకోగా మిథాలీ రాజ్‌ ఏడవ స్థానంలో ఉన్నారు.

మహిళల తరపున ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌ కార్లోత్‌ ఎడ్వర్డ్‌ 2605 పరుగులతో తొలిస్థానంలో ఉన్నారు. ఇటీవలే అంతర్జాతీయ మహిళా వన్డే క్రికెట్‌లో అత్యధిక హాఫ్‌ సెంచరీలు నమోదు చేసిన రికార్డును మిథాలీ సొంతం చేసుకున్నారు. ఇంగ్లండ్‌ మాజీ క్రీడాకారిణి ఎడ్వర్డ్స్‌ పేరిట ఉన్న 55 హాఫ్‌ సెంచరీల రికార్డును మిథాలీ బ్రేక్‌ చేసిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top