స్టార్క్‌ స్టన్నింగ్‌ 'బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ'

 Mitchell Starc Bowls an Unplayable Delivery to Dismiss James Vince - Sakshi

పెర్త్‌ : ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ వావ్‌ అనిపించాడు. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ జేమ్‌ విన్స్‌ను స్టన్నింగ్‌ బంతితో పెవిలియన్‌ చేర్చాడు. మూడో టెస్ట్‌ నాలుగు రోజు ఆటలో జరిగిన ఈ అద్భుతం ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. గంటకు143.9 కిలోమీటర్ల  వేగంతో విసిరిన బంతి ఒక్కసారిగా 40 సెంటీమీటర్ల మేర స్వింగ్‌ అయి  జేమ్‌విన్స్‌ ఆఫ్‌ స్టంప్‌ను ఎగరగొట్టేసింది. దీంతో​ జేమ్‌విన్స్‌ సంభ్రమాశ్య్చర్యానికి లోనయ్యాడు. అసలు ఏం జరిగిందో అతనికి అర్థం కాలేదు. ఇక ఈ బంతిని ‘బాల్‌ ఆఫ్‌ ది సమ్మర్‌’ , బాల్‌ ఆఫ్‌ది యాషెస్‌, బాల్‌ ఆఫ్‌ది 21వ సెంచరీ, బాల్‌ ఆఫ్‌ ది మిలినియమ్‌ అని క్రికెట్‌ అభిమానులు పేర్కొంటున్నారు. ఇక ఈ బంతిపై పేస్‌ దిగ్గజం వసీం అక్రమ్‌ కూడా ప్రశంసలు కురిపించారు. 

సోమవారం ఆస్ట్రేలియా ఖాతాలో యాషెస్‌ సిరీస్‌ చేరడం ఖాయమనిపిస్తోంది. ఇప్పటికే రెండు టెస్టులు గెల్చుకున్న ఆస్ట్రేలియా మూడో టెస్టులోనూ విజయం దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను కష్టాల్లోకి నెట్టింది. 

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 403 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 132/4
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 662/9 డిక్లేర్‌

స్టార్క్‌ స్టన్నింగ్‌ 'బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top