సీక్రెట్ గా పెళ్లి చేసుకుని రియో వెళ్లాడు! | Michael Phelps got married before Olympics in hushed affair | Sakshi
Sakshi News home page

సీక్రెట్ గా పెళ్లి చేసుకుని రియో వెళ్లాడు!

Oct 28 2016 5:26 PM | Updated on Sep 4 2017 6:35 PM

సీక్రెట్ గా పెళ్లి చేసుకుని రియో వెళ్లాడు!

సీక్రెట్ గా పెళ్లి చేసుకుని రియో వెళ్లాడు!

అమెరికా దిగ్గజ స్విమ్మర్ మైకెల్ ఫెల్ప్స్ సీక్రెట్ గా పెళ్లిచేసుకున్న విషయం వెల్లడైంది.

ఆరిజోనా: అమెరికా దిగ్గజ స్విమ్మర్ మైకెల్ ఫెల్ప్స్ సీక్రెట్ గా పెళ్లిచేసుకున్న విషయం వెల్లడైంది. రియో ఒలింపిక్స్ కంటే ముందే అతడు రహస్యంగా వివాహం చేసుకున్నట్టు ఆరిజోనా రిపబ్లిక్ న్యూస్ పేపర్ తెలిపింది. మాజీ మిస్ కాలిఫోర్నియా నికోల్ జాన్సన్(31)ను ఆరిజోనాలోని ప్యారడైజ్ వ్యాలీలో జూన్ 13న ఫెల్ప్స్ పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లికి సంబంధించిన సర్టిఫికెట్ ను కూడా బయటపెట్టింది.

అయితే వీరిద్దరూ రహస్యంగా ఎందుకు పెళ్లి చేసుకన్నారో వెల్లడికాలేదు. ఫెల్ప్స్ పెళ్లి వార్తపై అతడి తరపు ప్రతినిధులు ఇంకా స్పందిచలేదు. ఫెల్ప్స్, నికోల్  నిశ్చితార్థం 2015, ఫిబ్రవరిలో జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే ఫెల్ప్స్.. రియోకు పయనమయ్యాడు. తన క్రీడాజీవితంలో 23వ ఒలింపిక్‌ గోల్డ్ మెడల్ సాధించాడు. కొలనులో బంగారు పతకాల పంట పండించి ఘనంగా కెరీర్‌కు ముగింపు పలికాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement