ఆ షాక్ మియాందాద్ను వదల్లేదు:అనురాగ్ | Miandad has not recovered from shock over Pak's defeat: Thakur | Sakshi
Sakshi News home page

ఆ షాక్ మియాందాద్ను వదల్లేదు:అనురాగ్

Oct 4 2016 3:30 PM | Updated on Sep 4 2017 4:09 PM

ఆ షాక్ మియాందాద్ను వదల్లేదు:అనురాగ్

ఆ షాక్ మియాందాద్ను వదల్లేదు:అనురాగ్

భారత్ పై యుద్ధానికి సిద్ధమంటూ వ్యాఖ్యానించిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.

న్యూఢిల్లీ: భారత్ పై యుద్ధానికి సిద్ధమంటూ వ్యాఖ్యానించిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్  మండిపడ్డారు. ఇంకా పాత జ్ఞాపకాల నుంచి మియాందాద్ ఇంకా తేరుకోలేదని అనురాగ్ ఘాటుగా స్పందించారు. తమపై  యుద్ధానికి సిద్ధమైతే మరోసారి పాకిస్తాన్ కు చావుదెబ్బ తప్పదని విమర్శించారు. అది క్రికెట్ ఫీల్డ్ అయినా, యుద్ధ భూమిలో అయినా పాక్ పై భారత్ దే పైచేయి అనే సంగతిని గుర్తించుకోవాలన్నారు.

 

'మాపై పాకిస్తాన్ ఎదుర్కొన్న ఓటముల నుంచి మియాందాద్ ఇంకా కోలుకున్నట్లు లేడు. ఒకవేళ మియాందాద్ కు అతని దేశానికి చెందిన ప్రజలపై  నమ్మకంగా ఉంటే, దావూద్ను భారత్ కు వెళ్లమని చెప్పాలి. అది ఎందుకు చేయడంలేదు. ఇప్పటివరకూ పాకిస్తాన్ పై మాదే పైచేయి. భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది' అని మియాందాద్ చేసిన వ్యాఖ్యలకు అనురాగ్ చురకలంటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement