వచ్చే నెల్లో 'మాస్టర్స్ లీగ్' | Masters Champions League to be started next month | Sakshi
Sakshi News home page

వచ్చే నెల్లో 'మాస్టర్స్ లీగ్'

Dec 28 2015 3:58 PM | Updated on Sep 3 2017 2:42 PM

వచ్చే నెల్లో 'మాస్టర్స్ లీగ్'

వచ్చే నెల్లో 'మాస్టర్స్ లీగ్'

మరోసారి మాజీ క్రికెటర్లు తమ ఆటతో అలరించేందకు సిద్ధమవుతున్నారు.

న్యూఢిల్లీ: మరోసారి మాజీ క్రికెటర్లు తమ ఆటతో అలరించేందకు సిద్ధమవుతున్నారు. ఇందుకు మాస్టర్స్ చాంపియన్స్ లీగ్(ఎంసీఎల్) వేదిక కాబోతుంది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకూ యూఏఈలోని పలుచోట్ల జరిగే మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. లిబ్రా లెజెండ్స్, జెమినీ అరేబియన్స్, కాప్రికోర్న్ కమాండర్స్, లియో లైన్స్, విర్గో సూపర్ కింగ్స్ , సాగిటారియస్ స్ట్రైకర్స్ లు పోటీకి సన్నద్ధమవుతున్నాయి.

 

ఈ లీగ్ లో  లిబ్రా లెజెండ్స్ కు సౌరవ్ గంగూలీ నేతృత్వం వహిస్తుండగా, జెమినీ అరేబియన్స్ జట్టుకు వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ లీగ్ కు టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తుండటం మరో విశేషం. తొలి ఎడిషన్ లో సెమీ ఫైనల్ , ఫైనల్ మ్యాచ్ లతో కలుపుకుని మొత్తం 18 మ్యాచ్ లు జరగనున్నాయి. ఎంసీఎల్ టోర్నీలో బ్రియాన్ లారా, ముత్తయ మురళీ ధరన్, ఆడమ్ గిల్ క్రిస్ట్, పాల్ కాలింగ్ వుడ్, బ్రెట్ లీ, జాక్వస్ కల్లిస్, మహేలా జయవర్ధనే, కుమార సంగక్కరా తదితరులు పాల్గొంటున్నారు. ఈ లీగ్ ను సోని టెలివిజన్ ప్రసారం చేయనుంది.
 

షెడ్యూల్..



జనవరి 28, రాత్రి 7.30            -  లిబ్రా లెజెండ్స్-జెమినీ అరేబియన్స్(దుబాయ్)

జనవరి 29 ,మధ్యాహ్నం 3.00     -    కాప్రికోర్న్ కమాండర్స్-లియో లైన్స్(దుబాయ్)

జనవరి29, రాత్రి 7.30        -       విర్గో సూపర్ కింగ్స్ -సాగిటారియస్ స్ట్రైకర్స్ (దుబాయ్)

జనవరి30 , మధ్యాహ్నం 3.00      -  జెమినీ అరేబియన్స్--లియో లైన్స్(దుబాయ్)

జనవరి30, రాత్రి 7.30      -     సాగిటారియస్ స్ట్రైకర్స్ -కాప్రికోర్న్ కమాండర్స్(దుబాయ్)

ఫిబ్రవరి 3, మధ్యాహ్నం 3.00    -    లిబ్రా లెజెండ్స్-విర్గో సూపర్ కింగ్స్(షార్జా)

ఫిబ్రవరి3, రాత్రి 7.30         -        జెమినీ అరేబియన్స్-కాప్రికోర్న్ కమాండర్స్(షార్జా)

ఫిబ్రవరి 4, మధ్యాహ్నం 3.00      -  లిబ్రా లెజెండ్స్-సాగిటారియస్ స్ట్రైకర్స్(షార్జా)

ఫిబ్రవరి 4 ,రాత్రి 7-30      -       లియో లైన్స్-విర్గో సూపర్ కింగ్స్(షార్జా)

ఫిబ్రవరి 5  మధ్యాహ్నం 3.00    - సాగిటారియస్ స్ట్రైకర్స్- జెమినీ అరేబియన్స్(షార్జా)

ఫిబ్రవరి 5, రాత్రి 7.30      -     లిబ్రా లెజెండ్స్-కాప్రికోర్న్ కమాండర్స్(షార్జా)

ఫిబ్రవరి 6, మధ్యాహ్నం 3.00    - జెమినీ అరేబియన్స్-విర్గో సూపర్ కింగ్స్(షార్జా)

ఫిబ్రవరి 6, రాత్రి 7.30     -     లియో లైన్స్-   సాగిటారియస్ స్ట్రైకర్స్(షార్జా)

ఫిబ్రవరి 7, మధ్యాహ్నం 3.00   - విర్గో సూపర్ కింగ్స్- కాప్రికోర్న్ కమాండర్స్(షార్జా)

ఫిబ్రవరి 7, రాత్రి 7.30       -    లిబ్రా లెజెండ్స్-లియో లైన్స్(షార్జా)

ఫిబ్రవరి 11, రాత్రి 7.30        -   సెమీ ఫైనల్ -1 (దుబాయ్)

ఫిబ్రవరి 12, రాత్రి 7.30       -   సెమీ ఫైనల్-2 (దుబాయ్)

ఫిబ్రవరి 13,  రాత్రి 7.30    -     ఫైనల్ (దుబాయ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement