‘మన్కడింగ్‌’ మారింది! | "Mankading become! | Sakshi
Sakshi News home page

‘మన్కడింగ్‌’ మారింది!

Apr 13 2017 1:18 AM | Updated on Sep 5 2017 8:36 AM

‘మన్కడింగ్‌’ మారింది!

‘మన్కడింగ్‌’ మారింది!

మన్కడింగ్‌... క్రికెట్‌లో వివాదాస్పద నిబంధనల్లో ఒకటి. క్రికెట్‌ నియమావళి 42.15 ప్రకారం బౌలర్‌ బంతి విసరకముందే నాన్‌

లండన్‌: మన్కడింగ్‌... క్రికెట్‌లో వివాదాస్పద నిబంధనల్లో ఒకటి. క్రికెట్‌ నియమావళి 42.15 ప్రకారం బౌలర్‌ బంతి విసరకముందే నాన్‌ స్ట్రయికర్‌ క్రీజ్‌ దాటినప్పుడు అతడిని అవుట్‌ చేసే అవకాశం ఈ నిబంధన కల్పిస్తుంది. దీన్ని 1947–48లో తొలిసారిగా భారత బౌలర్‌ వినూ మన్కడ్‌ చేయడంతో ఆయన పేరుమీదుగా మన్కడింగ్‌ నిబంధనగా మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) నియమావళిలో చేర్చారు. అయితే ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని చాలా సందర్భాల్లో వివాదం జరిగింది. 

అయితే ఈ నిబంధనను ఎంసీసీ మార్చేసింది. ఇప్పుడు దీన్ని 41.16 నిబంధన ప్రకారం ‘బ్యాట్స్‌మన్‌ తప్పిదం’గా మార్చారు. పూర్తిగా బౌలర్‌కు అనుకూలమైన నిబంధనగా మారిందిపుడు. గతంలో బౌలర్‌ యాక్షన్‌కు ముందు మాత్రమే ఔట్‌ చేసే అవకాశముండేది. ఇప్పుడు యాక్షన్‌ (బంతి విడుదలకు ముందు చేయి పూర్తిగా తిరిగినా) తర్వాత కూడా ఔట్‌ చేసే వెసులుబాటు కల్పించారు. ఏప్రిల్‌ 12న మన్కడ్‌ జయంతి. పైగా ఈ ఏడాది శత జయంతి రోజే ఆయన పేరుతో ఉన్న నిబంధన మారడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement