
ఉలన్ ఉడే: పసిడి ‘పంచ్’ విసరాలని ఆశించిన భారత మహిళా బాక్సర్ మంజు రాణికి నిరాశ ఎదురైంది. ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆమెకు రజత పతకం లభించింది. ఆదివారం జరిగిన 48 కేజీల విభాగం ఫైనల్లో మంజు 1–4తో ఎకతెరీనా పల్త్‌సెవా (రష్యా) చేతిలో ఓడింది. ఈ పోటీల్లో భారత్ మూడు కాంస్యాలు, ఒక రజతంతో మొత్తం నాలుగు పతకాలను సాధించింది. సెమీస్‌లో ఓడిన మేరీకోమ్ (51 కేజీలు), జమున (54 కేజీలు), లవ్లీనా (69 కేజీలు)లకు కాంస్యాలు లభించాయి.