లయన్ విజృంభణ | Lyon bags his fourth as Mominul exits | Sakshi
Sakshi News home page

లయన్ విజృంభణ

Sep 4 2017 1:09 PM | Updated on Sep 17 2017 6:23 PM

లయన్ విజృంభణ

లయన్ విజృంభణ

బంగ్లాదేశ్ తో ఇక్కడ ఆరంభమైన రెండో టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాధన్ లయన్ విజృంభిస్తున్నారు.

చిట్టగాంగ్: బంగ్లాదేశ్ తో ఇక్కడ ఆరంభమైన రెండో టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాధన్ లయన్ విజృంభిస్తున్నారు. తన స్సిన్ మ్యాజిక్ తో చెలరేగిపోతున్న లయన్.. బంగ్లాదేశ్ కు సొంతగడ్డపైనే చుక్కలు చూపిస్తున్నారు. గింగిరాలు తిరిగే బంతులతో బంగ్లాదేశ్ తొలి నాలుగు వికెట్లను కూల్చి సత్తాచాటుకున్నారు.

బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్(9)ను మొదటి వికెట్ గా పెవిలియన్ కు పంపిన లయన్.. ఆపై కీలక ఆటగాడు ఇమ్రుల్ కెయిస్(4)అవుట్ చేశాడు. అటు తరువాత కాసేపటికి సౌమ్య సర్కార్(33), మోమినుల్ హక్(31)లను పెవిలియన్ కు పంపాడు.  లయన్ సాధించిన నాలుగు వికెట్లు ఎల్బీ రూపంలో రావడం ఇక్కడ మరో విశేషం. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్.. రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. అయితే ఆదిలోనే బంగ్లాదేశ్ కు లయన్ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లయన్ ను ఎదుర్కోలేక బంగ్లాదేశ్ తీవ్ర ఇబ్బందులు పడుతూ బ్యాటింగ్ కొనసాగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement