దక్షిణాఫ్రికా హెడ్‌ కోచ్‌గా బౌచర్‌

Legendary wicketkeeper Mark Boucher becomes South Africa head coach - Sakshi

2023 వరకు పదవిలో

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికా జట్టు హెడ్‌ కోచ్‌గా మాజీ టెస్టు వికెట్‌ కీపర్‌ మార్క్‌ బౌచర్‌ శనివారం నియమితులయ్యాడు. అతను ప్రొటీస్‌ జట్టుకు 2023 వరకు కోచ్‌గా పనిచేస్తాడని దక్షిణాఫ్రికా క్రికెట్‌ తాత్కాలిక డైరెక్టర్, మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ తెలిపాడు. బుధవారం తాత్కాలిక డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన గ్రేమ్‌ స్మిత్‌ వెంటనే జట్టు కోచింగ్‌ సిబ్బంది నియామకంపై దృష్టి సారించాడు. హెడ్‌ కోచ్‌గా 43 ఏళ్ల మార్క్‌ బౌచర్‌తో పాటు, అసిస్టెంట్‌ కోచ్‌గా ఇనోచ్‌ ఎన్‌వే, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు  కోచ్‌గా మాజీ టెస్టు బ్యాట్స్‌మన్‌ యాష్‌వెల్‌ ప్రిన్స్‌ను నియమించాడు. మరో వారం రోజుల్లో సీనియర్‌ జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్‌ కన్సల్టెంట్స్‌ను నియమిస్తానని తెలిపాడు. బౌచర్‌ 147 టెస్టులు, 290 వన్డేలు, 25 టి20 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2012లో కంటికి తీవ్ర గాయం కావడంతో అతను ఆటకు స్వస్తి పలికాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top