శ్రీలంక లక్ష్యం 462

Lanka need 447 runs to win - Sakshi

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు 

గాలె: శ్రీలంకతో జరగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లండ్‌ విజయంపై గురి పెట్టింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుతంగా ఆడిన ఆ జట్టు శ్రీలంక ముందు 462 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గురువారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 15 పరుగులు చేసింది.  మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక నెగ్గాలంటే ఇంకా 447 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు తొలి మ్యాచ్‌ ఆడుతున్న బెన్‌ ఫోక్స్‌ (107; 10 ఫోర్లు) సెంచరీతో అదరగొట్టడంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగుల వద్ద ఆలౌటైంది.

పెరీరాకు 5 వికెట్లు దక్కాయి. అనంతరం  శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 203 పరుగులకే పరిమితమైంది. మాథ్యూస్‌ (52) ఒక్కడే అర్ధసెంచరీ చేశాడు. ఆ తర్వాత కీటన్‌ జెన్నింగ్స్‌ (146 నాటౌట్‌; 9 ఫోర్లు) సెంచరీకి తోడు  స్టోక్స్‌ (62; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించడంతో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 322 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top