‘టాప్’లోకి జ్వాల, అశ్విని | jwala andAshwini Into the top | Sakshi
Sakshi News home page

‘టాప్’లోకి జ్వాల, అశ్విని

Jul 11 2015 12:59 AM | Updated on Sep 3 2017 5:15 AM

‘టాప్’లోకి జ్వాల, అశ్విని

‘టాప్’లోకి జ్వాల, అశ్విని

భారత బ్యాడ్మింటన్ డబుల్స్ మేటి క్రీడాకారిణిలు జ్వాల-అశ్విని జోడిని ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం’ (టాప్) స్కీమ్‌లో

 కేంద్ర క్రీడాశాఖ నిర్ణయం

న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ మేటి క్రీడాకారిణిలు జ్వాల-అశ్విని జోడిని ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం’ (టాప్) స్కీమ్‌లో చేర్చనున్నారు. ఈ మేరకు కేంద్ర క్రీడాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే జాబితాలో ఈ ఇద్దరి పేర్లను చేరుస్తామని మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు ధ్రువీకరించారు. ‘బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కోసం డబుల్స్ కోచ్ ఉండాలని మేం ఆమోద ముద్ర వేశాం. కాబట్టి మేటి ఆటగాళ్లను టాప్‌లోకి తీసుకురావాలని నిర్ణయించాం. ప్రస్తుతం జ్వాల-అశ్విని కంటే మెరుగైన క్రీడాకారిణిలు లేరు. వాళ్లను టాప్‌లో చేరుస్తాం. గోపీచంద్‌పై వాళ్లు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు. టాప్ సమావేశాల్లో కనీసం ఒక్కసారి కూడా గోపీ వాళ్ల గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కేవలం అతని వల్లే మేం డబుల్స్ కోచ్‌ను తీసుకునేందుకు అంగీకరించాం’ అని సదరు అధికారి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement