జూనియర్ రొనాల్డో ప్రాక్టీస్ మొదలు | Junior Ronaldo to start practice | Sakshi
Sakshi News home page

జూనియర్ రొనాల్డో ప్రాక్టీస్ మొదలు

May 17 2015 12:51 AM | Updated on Apr 4 2019 5:41 PM

ఫుట్‌బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో... తన నాలుగేళ్ల కుమారుడి తో కూడా ప్రాక్టీస్ మొదలు పెట్టించాడు.

ఫుట్‌బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో... తన నాలుగేళ్ల కుమారుడి తో కూడా ప్రాక్టీస్ మొదలు పెట్టించాడు. ప్రస్తుతం ఫుట్‌బాల్ ప్రపంచంలో అందరికంటే ఫిట్‌గా ఉండేది ఈ పోర్చుగల్ స్టార్. అందుకే తన కుమారుడితో కూడా ఇప్పుడు ఫిట్‌నెస్ ఎక్సర్‌సైజ్‌లు చేయిస్తున్నాడు. పిల్లాడితో ఆగకుండా పది సిట్‌అప్స్ చేయించి ఆ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

భవిష్యత్‌లో తన కుమారుడినీ ఫుట్‌బాల్ స్టార్‌ని చేయబోతున్నాననే సంకేతం ఇచ్చాడు రొనాల్డో. ఆ పిల్లాడు కూడా తండ్రి చెప్పిన ప్రతి ఎక్సర్‌సైజ్‌నూ బుద్ధిగా చేశాడు. దాదాపు అరగంటసేపు కష్టపెట్టిన తర్వాత పిల్లాడిని ఎత్తుకుని గాల్లోకి ఎగరేసి... ఆ తర్వాత గట్టిగా వాటేసుకుని రొనాల్డో తన పుత్రోత్సాహాన్ని కూడా ఆ వీడియోలో చూపించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement