చివరి శ్వాస వరకు పోరాడతా: జడేజా

Jadeja Says I Will Keep Giving My Best Till My Last Breath - Sakshi

మాంచెస్టర్‌: రవీంద్ర జడేజా.. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి పదేళ్లయినా వన్డేల్లో పూర్తి స్థాయి ఆటగాడిగా కొనసాగలే కపోయాడు. అప్పుడప్పుడూ మె రిసినా టెస్టు క్రికెటర్‌గానే పరిమితమ య్యాడు. విమర్శలెదురైన ప్రతీసారి బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. చహల్, కుల్‌దీప్‌ రాకతో వన్డేల్లో అతడి స్థానమే కష్టతరమైంది. వన్డేల్లో ఇక రాలేడనుకున్న సమయంలో ప్రపంచకప్‌లో చోటుదక్కింది. లీగ్‌ దశలో అవకాశం రాకపోయినా ఎదురు చూశాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో అతడు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాకపోయినా కీలక సెమీఫైనల్స్‌లో విజృంభించాడు. తనను గల్లీ స్థాయి ఆటగాడంటూ మాజీ ఆటగాడు సంజయ్‌ మంజ్రేకర్‌ చేసిన వ్యాఖ్యలకు ట్వీట్‌తో పాటు బ్యాట్‌తోనూ గట్టి జవాబి చ్చాడు. 

తాను పార్ట్‌టైం క్రికెటర్‌ కాదనే విష యాన్ని చాటిచెప్పాడు. టాప్‌ఆర్డర్‌ కుప్ప కూలి, పిచ్‌ బౌలర్లకు సహకరి స్తున్న కఠిన పరిస్థితుల్లో జడేజా (77; 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మైదానంలోకి అడుగుపెట్టి గొప్ప పోరాటం చేశాడు. 92/6తో ఘోర పరాభవానికి చేరువైన జట్టును 200 పరుగులు దాటించి ఆశలుపెంచాడు. ధోనీ (50; 72 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌) ఉన్నాడనే ధీమా అతడి బ్యాటింగ్‌లో స్పష్టంగా కనిపించింది. కొండంత లక్ష్యాన్ని కరగదీస్తూ వెళ్లాడు. కచ్చితమైన షాట్లు ఆడుతూనే విలువైన భాగస్వామ్యం నిర్మించాడు. కివీస్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ ఎదురొడ్డి నిలబడ్డాడు. భారత్‌ ఓడినా తన అద్భుత ప్రదర్శనతో హీరో అయ్యాడు జడేజా. అతని పోరాటమే కాదు, మ్యాచ్‌ అనంతరం అతను చేసిన ట్వీట్‌ కూడా అభిమానులను ఆకట్టుకుంది. 

ఆ ట్వీట్‌ సారాంశం ఇది..
‘‘విఫలమైన ప్రతీసారి.. నిలబడి ఎలా పోరాడాలో క్రికెట్టే నాకు నేర్పింది. నాకు స్ఫూర్తిని కలిగించిన అభిమానులందరికీ కృతజ్ఞతలు చెప్పడం చాలా చిన్న విషయం. మీరు నాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు. నాకు స్ఫూర్తిని కలిగిస్తూనే ఉండండి. నా చివరి శ్వాస వరకు ఉత్తమ ప్రదర్శన ఇస్తా’’ అంటూ జడేజా ట్వీట్‌ చేశారు. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top