చివరిదైన నాలుగో టెస్టులో ఫలితం తేలే అవకాశాలున్నాయని ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజల్‌వుడ్ అభిప్రాయపడ్డాడు.
చివరిదైన నాలుగో టెస్టులో ఫలితం తేలే అవకాశాలున్నాయని ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజల్‌వుడ్ అభిప్రాయపడ్డాడు. సిరీస్ గెలుచుకోవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ నెగ్గడం తప్పనిసరి. ‘నా ఉద్దేశం ప్రకారం ఇక్కడి వికెట్‌పై ఫలితం వచ్చే అవకాశాలున్నాయి. నిజానికి ఒత్తిడంతా భారత్‌పైనే ఉంది. సిరీస్ ఆరంభానికి ముందు 4–0తో గెలుస్తారని భావించారు. కానీ ఇప్పుడు వారు 1–1తో నిలిచి ఒత్తిడిలో పడ్డారు’ అని హేజల్‌వుడ్ అన్నాడు.