‘వాళ్లిద్దరే అత్యుత్తమం.. కోహ్లి కాదు’ | Sakshi
Sakshi News home page

‘వాళ్లిద్దరే అత్యుత్తమ సారథులు.. కోహ్లి కాదు’

Published Sun, Apr 19 2020 2:45 PM

IPL: Dhoni And Rohit Jointly Declared As The Greatest Captains - Sakshi

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ఎంఎస్‌ ధోని, రోహిత్‌ శర్మలు  అత్యుత్తమ సారథులని స్టార్‌ స్పోర్ట్స్‌ స్పెషల్‌ జూరీ తేల్చిచెప్పింది. 20 మంది మాజీ క్రికెటర్లు, స్పోర్ట్స్‌ జర్నలిస్టులు, క్రికెట్‌ నిపుణులతో కూడిన జూరీ సభ్యులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ నాలుగు సార్లు, ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ మూడు సార్లు టైటిల్‌ గెలిచిన విషయాన్ని గుర్తుచేస్తూ అల్‌టైం అత్యుత్తమ సారథులగా వీరిద్దరు సంయుక్తంగా నిలిచారని తెలిపారు. 

విధ్వంసకర బ్యాట్స్‌మన్‌, మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌ ఐపీఎల్‌ బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ అని పేర్కొన్నారు. అదేవిధంగా ముంబై ఇండియన్స్‌ సీనియర్‌ బౌలర్‌, యార్కర్‌ కింగ్‌ లసిత్‌ మలింగ బౌలింగ్‌ విభాగంలో టైటిల్‌ను గెలుచుకున్నట్లు తెలిపారు. ఇక ఆల్‌రౌండర్‌ జాబితాలో షేన్‌ వాట్సన్‌ ది బెస్ట్‌గా నిలిచాడని చెప్పారు. సీఎస్‌కే ప్రధాన కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ఉత్తమ కోచ్‌గా ఎంపికయ్యాడన్నారు. ఇక 177 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 5412 పరుగులు సాధించిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లి భారత అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని జ్యూరీ సభ్యులు స్పష్టం చేశారు. 

చదవండి:
అప్పుడు రైనాకే ధోని ఓటేశాడు: యువీ

రోహిత్‌ క్రికెటర్‌ కాదన్న పఠాన్‌.. సమర్థించిన షమీ

Advertisement

తప్పక చదవండి

Advertisement