11 స్వర్ణాలు,  10 రజతాలు 

India win 11 gold on opening day of South Asian Junior Athletics - Sakshi

దక్షిణాసియా జూ.అథ్లెటిక్స్‌లో అదరగొట్టిన భారత్‌

కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా నిర్వహిస్తున్న దక్షిణాసియా జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేశారు. మొత్తం 11 స్వర్ణాలు, 10 రజతాలు, మూడు కాంస్యాలు నెగ్గారు. దీంతో భారత్‌ పతకాల పట్టికలో శనివారం అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల జావెలిన్‌ త్రోలో 71.47 మీటర్లు విసిరిన అర్షదీప్‌ సింగ్‌ భారత్‌కు తొలి బంగారు పతకం అందించాడు. మహిళల షాట్‌పుట్‌లో కిరణ్‌ బలియన్‌ 14.77 మీటర్లు విసిరి స్వర్ణం నెగ్గింది.

వీరిద్దరూ ఈ క్రీడల్లో కొత్త రికార్డు నెలకొల్పడం విశేషం. ఇదే విభాగంలో అనామికా దాస్‌ రజతం (14.54 మీ.) సాధించింది. పురుషుల లాంగ్‌ జంప్‌లో లోకేశ్‌ సత్యనాథన్‌ (7.74 మీ.), మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో సప్నా కుమారి 14.19 సెకన్ల టైమింగ్‌తో, 1500 మీటర్ల ఈవెంట్‌లో దుర్గా డోరె 4.31.38 టైమింగ్‌తో కొత్త రికార్డులు సృష్టించి స్వర్ణాలు అందుకున్నారు. 4గీ100 మీ. రిలే రేసులో పురుషుల బృందం బంగారు పతకం, మహిళల జట్టు రజతం దక్కించుకున్నాయి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top