రాహుల్‌కు నో ఛాన్స్‌.. ధావన్‌కే ఓటు

India Vs South Africa 2nd T20 At Mohali Dhawan In Rahul Out - Sakshi

మొహాలి : దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దవగా.. రెండో టీ20 మొహాలి వేదికగా జరగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో కోహ్లి ఛేజింగ్‌ వైపు మొగ్గు చూపాడు. రెండో టీ20లో  శిఖర్‌ ధావన్‌ కోసం కేఎల్‌ రాహుల్‌ను టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పక్కకు పెట్టింది. వెస్టిండీస్‌ సిరీస్‌లో నిలకడగా రాణించిన శ్రేయాస్‌ అయ్యర్‌కు మరో అవకాశం ఇచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో మనీశ్‌ పాండే రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. తొలి సారి సారథ్య బాధ్యతలు చేపట్టిన డికాక్‌ జట్టులో భారీ మార్పులు చేయలేదు. అయితే అందరూ అనుకున్నట్టుగా జూనియర్‌ డాలాను జట్టులోకి తీసుకోలేదు. 

ఇక భారత క్రికెట్‌ అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకునే టి20 మ్యాచ్‌లలో మొహాలీ స్టేడియంలో జరిగిన 2016 టి20 ప్రపంచ కప్‌ పోరు ఒకటి. ఆ్రస్టేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లి అత్యద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. ఇటీవల అతను దీని గురించే ఫొటోతో సహా గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ స్టేడియం వేదికపై భారత్‌ మళ్లీ ఇప్పుడే బరిలోకి దిగుతోంది. కొత్త సీజన్‌ను విజయంతో ప్రారంభించాలని పట్టుదలగా ఉన్న టీమిండియా నేటి టి20 మ్యాచ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. కాగా.. ఒకరిద్దరు మినహా పెద్దగా అనుభవం లేని దక్షిణాఫ్రికా జట్టు టీమిండియాకు ఎంత వరకు పోటీ ఇవ్వగలదో వేచి చూడాలి. 

తుది జట్లు: 
టీమిండియా: విరాట్‌ కోహ్లి(సారథి), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, నవదీప్‌ సైనీ, దీపక్‌ చహర్‌, వాషింగ్టన్‌ సుందర్‌
దక్షిణాఫ్రికా: డి కాక్‌ (కెప్టెన్‌), రీజా హెండ్రిక్స్, బవుమా, వాన్‌ డర్‌ డసెన్, మిల్లర్, జోర్న్‌ ఫార్చూన్, ఫెలుక్‌వాయో, రబడ, షమ్సీ, ప్రిటోరియస్,నోర్టే. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top