దాయాదుల పోరు : సోషల్‌ మీడియాకు బై చెప్పిన సానియా | India Pakistan Match Sani Sign Out For Social Media Few Days | Sakshi
Sakshi News home page

దాయాదుల పోరు : సోషల్‌ మీడియాకు బై చెప్పిన సానియా

Sep 19 2018 1:19 PM | Updated on Sep 19 2018 1:21 PM

India Pakistan Match Sani Sign Out For Social Media Few Days - Sakshi

సానియా మీర్జా (ఫైల్‌ ఫోటో)

దుబాయ్‌ : క్రికెట్‌లో ఫేవరెట్‌ జట్లంటే ముందు వినిపించే పేరు భారత్‌ - పాకిస్తాన్‌. అభిమానులనే కాక యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించే మ్యాచ్‌ ఏదైనా ఉందా అంటే అది దాయాదుల పోరే. ఇతర దేశాతో తలపడినప్పుడు వచ్చే ఫలితాలు ఎలా ఉన్నా పాక్‌ తలపడినప్పుడు మాత్రం మనోళ్లు కేవలం భారతే గెలవాలని ఆకాంక్షిస్తారు. ఆటగాళ్లు కూడా పాక్‌తో మ్యాచ్‌ అంటే సాధరణం కంటే కాస్తా ఎక్కువ టెన్షనే పడతారు. కానీ ఇప్పుడు అభిమానులు, క్రికెటర్ల కంటే ఎక్కువ టెన్షన్‌ పడుతున్నారు టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా.

సానియా పాక్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్‌ సానియాను ‘మీరు ఏ జట్టుకు మద్దతు తెలుపుతారు’ అన్ని ప్రశ్నించారు. అందుకు సానియా కాస్తా భిన్నమైన సమాధానం ఇచ్చారు. తాను కొన్ని రోజుల పాటు  సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు.

ఈ వియషం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘మ్యాచ్‌  ప్రారంభం కావడానికి 24 గంటలు కూడా లేదు. కొన్ని రోజుల పాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండటం మంచిది. లేకపోతే అడ్డమైన చెత్తవాగుడు వినాల్సి వస్తది. ఇదంతా వింటూ ఉంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా జబ్బు పడాల్సిందే.  మరి ప్రెగ్నెంట్‌ అయిన నా పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే కొన్ని రోజుల పాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటాను. కానీ మీరంతా ఒకటి గుర్తుంచుకొండి. ఇది కేవలం క్రికెట్‌ మ్యాచ్‌ మాత్రమే’ అంటూ ట్వీట్‌ చేశారు. దుబాయ్‌ వేదికగా.. ఈరోజు సాయంత్ర 5గంటలకు భారత్‌-పాక్‌ల మధ్య మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement