'ఆ మ్యాచ్ ఆస్ట్రేలియాకు గిఫ్ట్ గా ఇచ్చారు' | India in Australia: Dressing Room Unrest No Big Issue, Says Sourav Ganguly | Sakshi
Sakshi News home page

'ఆ మ్యాచ్ ఆస్ట్రేలియాకు గిఫ్ట్ గా ఇచ్చారు'

Dec 25 2014 9:34 AM | Updated on Sep 2 2017 6:44 PM

'ఆ మ్యాచ్ ఆస్ట్రేలియాకు గిఫ్ట్ గా ఇచ్చారు'

'ఆ మ్యాచ్ ఆస్ట్రేలియాకు గిఫ్ట్ గా ఇచ్చారు'

ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ ల్లో టీమిండియా వరుస ఓటములు ఎదుర్కొవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ ల్లో టీమిండియా వరుస ఓటములు ఎదుర్కొవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కీలక తరుణంలో విఫలమైన టీమిండియా ఆటగాళ్లు రెండు టెస్టుల్లో ఓటమిని కొనితెచ్చుకున్నారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాను ఆస్టేలియాలో కొట్టే అవకాశాన్ని టీమిండియా వదులుకుందుని మండిపడ్డాడు. బ్రిస్బేన్ లో జరిగిన రెండో టెస్టులో కీలక తరుణంలో జట్టు విఫలమైందన్నాడు. టీమిండియా మూడు -నాలుగు రోజులు పూర్తిగా వైఫల్యం చెందడంతోనే మ్యాచ్ ఆసీస్ చేతుల్లోకి వెళ్లిందని గంగూలీ స్పష్టం చేశాడు. ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ లో విరాట్ కోహ్లి-శిఖర్ ధావన్ ల మధ్య చోటు చేసుకున్న  వివాదాన్ని పెద్దదిగా చూడాల్సిన అవసరం లేదన్నాడు.

 

మెల్ బోర్న్ లో జరిగే మూడో టెస్టులో ఆ ప్రభావం ఏమీ ఉండదన్నాడు. గతంలో ఇదే తరహాలో కొన్నిసంఘటనలను ఉదాహరణగా పేర్కొన్నాడు. ఒకానొక సందర్భంలో  సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేయలేని పరిస్థితుల్లో తాను హడావుడిగా ప్యాడ్ లు కట్టుకుని క్రీజ్ లోకి వెళ్లానని గంగూలీ తెలిపాడు. ఆసీస్ నూతన టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన స్టీవెన్ స్మిత్ పై గంగూలీ ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియా కష్టాల్లో ఉన్న తరుణంలో స్మిత్ సెంచరీ చేసి కెప్టెన్ గా ఆకట్టుకున్నాడన్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement