ఆస్ట్రేలియాలో టీమిండియా ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోయినా మాజీ కోచ్ గ్యారీ కిర్స్టెన్ జట్టుకు మద్దతుగా నిలిచాడు.
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో టీమిండియా ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోయినా మాజీ కోచ్ గ్యారీ కిర్స్టెన్ జట్టుకు మద్దతుగా నిలిచాడు. ప్రపంచ కప్లు ఎలా గెలవాలో భారత్ నేర్చుకుందని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ కిర్స్టెన్ అన్నాడు. ధోనీసేకు టైటిల్ నిలబెట్టుకునే అవకాశముందని అభిప్రాయపడ్డాడు.
ప్రపంచ కప్లో క్వార్టర్స్, సెమీస్, ఫైనల్ మ్యాచ్లు కీలకమని కిర్స్టెన్ అన్నాడు. భారత్ నాకౌట్ దశకు చేరుతుందని, ఆ తర్వాత ఎలా గెలవాలో భారత్కు తెలుసని చెప్పాడు. 2011 ప్రపంచ కప్లో భారత్ గెలవడంలో కిర్స్టెన్ పాత్ర కూడా కీలకమైనది. అప్పట్లో టీమిండియా కోచ్గా ఉన్న కిర్స్టెన్.. కెప్టెన్ ధోనీతో కలసి జట్టును విజయవంతంగా నడిపించాడు.