టీమిండియా 'హాఫ్ సెంచరీ' | India cruise to 50th T20I win | Sakshi
Sakshi News home page

టీమిండియా 'హాఫ్ సెంచరీ'

Oct 8 2017 12:00 PM | Updated on Oct 8 2017 12:00 PM

India cruise to 50th T20I win

రాంచీ:ప్రపంచ టీ 20ల్లో  భారత క్రికెట్ జట్టు విజయాల సంఖ్య 'హాఫ్ సెంచరీ'కి చేరింది. శనివారం ఆస్ట్రేలియాతో మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి టీ 20ల్లో తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించిన అనంతరం భారత్ జట్టు 50వ గెలుపును తన ఖాతాలో వేసుకుంది. తద్వారా పొట్టి ఫార్మాట్ లో 50వ విజయాన్ని అందుకున్న నాల్గో జట్టుగా టీమిండియా నిలిచింది. అంతకుముందు వరుసలో పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఉన్నాయి.

నిన్నటి మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్  విరాట్ కోహ్లి ముందుగా ప్రత్యర్థి ఆస్ట్రేలియాను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. దాంతో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ ఆది నుంచి తడబడతూనే ఇన్నింగ్స్ కొనసాగించింది. అరోన్ ఫించ్ మినహాఎవరూ ఆకట్టుకోలేకపోవడంతో ఆసీస్ 18.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. ఆ తరుణంలో వర్షం రావడంతో మ్యాచ్ ను గంటకు పైగా నిలిపివేశారు. దానిలో భాగంగా వర్షం నిలిచిన తరువాత భారత్ విజయ లక్ష్యాన్ని డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఆరు ఓవర్లలో 48 పరుగులకు నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని వికెట్ కోల్పోయి 5.3 ఓవర్లలో ఛేదించిన భారత్ విజయాన్ని అందుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement