ధోనీలోని గొప్ప గుణం అదే: కోహ్లీ | If we play to our potential we can beat Australia: Virat Kohli | Sakshi
Sakshi News home page

ధోనీలోని గొప్ప గుణం అదే: కోహ్లీ

Mar 26 2016 3:20 PM | Updated on Sep 3 2017 8:38 PM

ధోనీలోని గొప్ప గుణం అదే: కోహ్లీ

ధోనీలోని గొప్ప గుణం అదే: కోహ్లీ

తమ సామర్థ్యం మేరకు ఆడితే ఆస్ట్రేలియాపై విజయం సాధిస్తామని టీమిండియా బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు.

మొహాలీ: తమ సామర్థ్యం మేరకు ఆడితే ఆస్ట్రేలియాపై విజయం సాధిస్తామని టీమిండియా బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. టి-20 ప్రపంచ కప్లో భాగంగా ఆదివారం ఆసీస్తో జరిగే కీలక మ్యాచ్కు ముందు రోజు కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఆసీస్ బలమైన జట్టని, కంగారూలు ఎంతో దూకుడుగా ఆడుతారని, అదే తరహాలో ఆడుతాననే నమ్మకముందని, సవాల్ను ఎదుర్కోవడాన్ని ఇష్టపడతానని చెప్పాడు.

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. ధోనీ చాలా ప్రశాంతంగా ఉంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడని, అతనిలో గొప్ప గుణం అదేనని అన్నాడు. టి-20 ఫార్మాట్లో నిలకడగా రాణించడం చాలా కష్టమని చెప్పాడు. ఈ ఫార్మాట్లో పూర్తిగా దృష్టిపెట్టి ఆడటం చాలా అవసరమని అన్నాడు. మైదానంలో అడుగుపెట్టేటపుడు తాను ఒత్తిడికి గురికాకుండా, ఓ అవకాశంగా భావిస్తానని చెప్పాడు. ప్రత్యర్థి జట్టును చూసి భయపడకుండా, సవాల్గా తీసుకోవాలని సూచించాడు. ప్రపంచ కప్లో సెమీస్, ఫైనల్ మ్యాచ్లను గెలిస్తే మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుందని కోహ్లీ అన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement