‘గే’ వివాదంపై ఐసీసీ విచారణ

ICC Charges Shannon Gabriel For Anti Gay Remarks - Sakshi

దుబాయ్ ‌: ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ను ‘గే’గా సంబోంధించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న వెస్టిండీస్‌ పేసర్‌ షెనాన్‌ గాబ్రియెల్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) విచారణకు ఆదేశించింది. ‘షానన్‌ గాబ్రియల్‌పై మ్యాచ్‌ అంపైర్ల ఫిర్యాదు మేరకు ఐసీసీ ఆటగాళ్ల ప్రవర్తనా నియామవళి 2.13 కింద అభియోగాలు నమోదయ్యాయి. ఈ వివాదాన్ని మ్యాచ్‌ రిఫరీ జెఫ్‌ క్రో విచారణ చేపడుతారు. ఈ విచారణ పూర్తేయ్యే వరకు ఐసీసీ ఈ వివాదంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోదు’ అని ఐసీసీ తన మీడియా అధికారిక ట్విటర్‌లో పేర్కొంది.

మ్యాచ్‌ మూడో రోజు ఆటలో భాగంగా రూట్, డెన్లీ క్రీజ్‌లో ఉన్న సమయంలో విండీస్‌ పేసర్‌ షెనాన్‌ గాబ్రియెల్‌తో మాటల యుద్ధం జరిగింది. రూట్‌ను సరిగ్గా గాబ్రియెల్‌ ఏమన్నాడో ఎక్కడా బయట పడలేదు. అయితే రూట్‌ మాత్రం ఆ తర్వాత... ‘గే’ కావడంలో తప్పేమీ లేదు. మరొకరిని అవమానించేందుకు ఆ పదాన్ని వాడాల్సిన అవసరం లేదు’ అని గాబ్రియెల్‌తో చెప్పడం మాత్రం స్టంప్‌ మైక్‌లో రికార్డయింది. దీంతో ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. 

అయితే అంతకుముందు తమ మధ్య ఏం జరిగిందో, గాబ్రియెల్‌ ఏమన్నాడో చెప్పేందుకు మాత్రం రూట్‌ నిరాకరించాడు. ‘గాబ్రియెల్‌ తాను అన్న మాటల గురించి తర్వాత కచ్చితంగా బాధ పడతాడు. అయితే కొన్ని విషయాలు మైదానానికే పరిమితం కావాలి. అతను నిజానికి మంచి వ్యక్తి. ఎలాగైనా మ్యాచ్‌ గెలవాలనే కసితో ఆడతాడు. ఈ క్రమంలో భావోద్వేగాలు దాచుకోలేకపోయాడు. సిరీస్‌ చాలా బాగా జరిగింది. తమ ప్రదర్శన పట్ల అతను గర్వపడాల్సిన క్షణమిది’ అంటూ ప్రత్యర్థి బౌలర్‌ గురించి రూట్‌ సానుకూలంగా మాట్లాడాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ సందర్భంగా పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ కూడా ఈ తరహా జాతి వివక్ష వ్యాఖ్యలు చేసి నాలుగు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. గాబ్రియల్‌పై అభియోగాలు రుజువైతే అతనిపై కూడా నిషేధం పడనుంది. మూడో టెస్ట్‌లో వెస్టిండీస్‌ 232 పరుగుల తేడాతో ఓడినప్పటికి మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top