హైదరాబాద్‌ స్కై ఓటమి | hyderabad sky defeated in basket ball tourny | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ స్కై ఓటమి

Mar 3 2017 10:37 AM | Updated on Sep 19 2018 6:29 PM

యూబీఏ బాస్కెట్‌బాల్‌ లీగ్‌ నాలుగో సీజన్‌లో హైదరాబాద్‌ స్కై జట్టు పోరాటం క్వార్టర్‌ ఫైనల్లో ముగిసింది.

చెన్నై: యూబీఏ బాస్కెట్‌బాల్‌ లీగ్‌ నాలుగో సీజన్‌లో హైదరాబాద్‌ స్కై జట్టు పోరాటం క్వార్టర్‌ ఫైనల్లో ముగిసింది. గురువారం ఇక్కడ జరిగిన హోరాహోరీ పోరులో హైదరాబాద్‌ స్కై 113–116 స్కోరుతో బెంగళూరు బీస్ట్‌ చేతిలో పోరాడి ఓడింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే బెంగళూరు ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. ఈ జట్టు తరఫున విశేష్‌ (57 పాయింట్లు) చెలరేగాడు. క్రమం తప్పకుండా పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

 

ఇతని జోరుతో తొలి రెండు క్వార్టర్లలో బెంగళూరే ఆధిక్యంలో నిలిచింది. మొదట 27–24తో తొలి క్వార్టర్‌ను, తర్వాత 60–53తో రెండో క్వార్టర్‌ను ముగించింది. అయితే హైదరాబాద్‌  ఎట్టకేలకు మూడో క్వార్టర్‌లో దూకుడు పెంచింది. దీంతో స్కై 74–68 పాయింట్లతో ఆధిక్యంలోకి వచ్చింది. చివరి క్వార్టర్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. దీంతో ఉత్కంఠ పెరిగింది. చివరకు మూడు పాయింట్ల తేడాతో బెంగళూరు బీస్ట్‌ జయకేతనం ఎగురవేసింది. బెంగళూరు జట్టులో విశేష్‌తో పాటు పల్‌ప్రీత్‌ బ్రార్‌ (27) రాణించాడు. హైదరాబాద్‌ తరఫున టెవిన్‌ కెల్లీ 40 పాయింట్లు చేశాడు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement