కోహ్లి సూపర్‌ ఫీల్డింగ్‌ చూశారా? | Have You Seen Virat Kohli Stunning Fielding In 4th ODI Against WI | Sakshi
Sakshi News home page

Oct 30 2018 9:27 AM | Updated on Oct 30 2018 11:09 AM

Have You Seen Virat Kohli Stunning Fielding In 4th ODI Against WI - Sakshi

రనౌట్‌ చేసిన అనంతం విరాట్‌ కోహ్లి

అరే ఏం ఫీల్డింగ్‌ అన్నా.. సూపర్‌పో..

ముంబై : మ్యాచ్‌ ఏదైనా తనదైన ముద్ర ఉండేలా చూసే టీమిండియా కెప్టన్‌​ విరాట్‌ కోహ్లి... ముంబైలో తక్కువ స్కోరుకే ఔటైనా మెరుపు ఫీల్డింగ్‌తో తళుక్కుమన్నాడు. సోమవారం వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో ఆ జట్టు బ్యాట్స్‌మన్‌ శామ్యూల్స్‌ కవర్స్‌ దిశగా కొట్టిన షాట్‌ను అడ్డుకున్న కోహ్లి... అంతే వేగంగా డైవ్‌తో బంతిని నాన్‌ స్ట్రయికింగ్‌ వైపు వికెట్లకేసి విసిరాడు. అది గురి చూసి వదిలిన బాణంలా తగలడం క్షణాల్లో జరిగి పోయింది. అప్పటికే చాలా ముందుకొచ్చిన కీరన్‌ పావెల్‌ తిరిగి క్రీజును చేరే అవకాశమూ లేకపోయింది. రెప్పపాటులో జరిగిన ఈ రనౌట్‌కు పావెల్‌ ఆశ్చర్యానికి గురయ్యాడు. (చదవండి: రోహిత్‌ ధమాకా రాయుడు పటాకా)
 

కోహ్లి స్టన్నింగ్‌ ఫీల్డింగ్‌తో మైదానంలోని భారత ఆటగాళ్లు, అభిమానులు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. ఇక నెటిజన్లు కోహ్లిని ఆకాశానికెత్తారు. ‘అరే ఏం ఫీల్డింగ్‌ అన్నా.. సూపర్‌’ అని ఒకరు.. బ్యాట్‌ ఝులిపించకుంటే.. ఫీల్డింగ్‌తో మైమరిపిస్తాడు దటీజ్‌ కోహ్లి అంటూ పొగడ్తలు వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇక ఈ సిరీస్‌లో వరుసగా మూడు సెంచరీలతో రికార్డు సృష్టించిన కోహ్లి ఈ మ్యాచ్‌లో (16) నిరాశపరిచాడు. హిట్‌ మ్యాన్‌ రోహిత్‌, తెలుగు తేజం అంబటి తిరుపతి రాయుడుల శతకాలతో భారత్‌ 224 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. (చదవండిధావన్‌.. నేను కూడా తొడగొడతా!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement